రేపు విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటన, పేదలందరికీ ఇళ్లు పథకం అమలు పరిశీలన

Pawan Kalyan to Visit to Gunkalam on Tomorrow to Review Implementation of the Housing Scheme for Poor People, Pawan Kalyan to Review Implementation of the Housing Scheme for Poor People, Implementation of the Housing Scheme for Poor People, Pawan Kalyan to Visit to Gunkalam, Housing Scheme for Poor People, Poor People Housing Scheme, Pawan Kalyan likely to visit Vizianagaram Tidko Houses In Gunkalam, Janasena Chief Pawan Kalyan, Poor People Housing Scheme News, Poor People Housing Scheme Latest News And Updates, Poor People Housing Scheme Live Updates, Mango News, Mango News Telugu

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు (నవంబర్ 13, ఆదివారం) విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం అమలును పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలపై వివరాలను ప్రజలందరికీ తెలియచెప్పేలా ‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో జనసేన పార్టీ కార్యక్రమం చేపట్టిందన్నారు.

నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 13, ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారని తెలిపారు. అక్కడ 397 ఎకరాల్లో భారీ ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించిందని, ఈ మేరకు సీఎం శంకుస్థాపన చేసి, పైలాన్ ఆవిష్కరించారని చెప్పారు. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారన్నారు. ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ గుంకలాం చేరుకొని అక్కడి ఇళ్లను పరిశీలించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయి, పథకం అమలు తీరుని లబ్దిదారులతో మాట్లాడి తెలుసుకుంటారని జనసేన పార్టీ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 8 =