వైసీపీ ఆధ్వర్యంలో నేటి నుంచి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభం

AP Gadapa Gadapaku Mana Prabhutvam a Mass Contact Program Starts From Today by YSRCP, Gadapa Gadapaku Mana Prabhutvam a Mass Contact Program Starts From Today by YSRCP Govt, a Mass Contact Program Starts From Today by YSRCP, AP Gadapa Gadapaku Mana Prabhutvam, Gadapa Gadapaku Mana Prabhutvam, Gadapa Gadapaku Mana Prabhutvam Program, AP Gadapa Gadapaku Mana Prabhutvam Program, YSRCP To Start Gadapa Gadapaku Mana Program, Mass Contact Gadapa Gadapaku Mana Program Starts From Today by YSRCP, YSRCP Govt, YSRCP, Yuvajana Sramika Rythu Congress Party, AP mass contact programme, Gadapa Gadapaku Mana Prabhutvam News, Gadapa Gadapaku Mana Prabhutvam Latest News, Gadapa Gadapaku Mana Prabhutvam Latest Updates, Gadapa Gadapaku Mana Prabhutvam Live UPdates, Mango News, Mango News Telugu,

జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనకు గుర్తుగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమం పేరుతో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 26 జిల్లాల్లో ప్రారంభించింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్‌ఆర్‌సి శాసనసభ్యులు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లు మరియు నాయకులు తొమ్మిది నెలల పాటు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలవాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమవుతోంది. అలాగే రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయ్యే వరకు జిల్లా స్థాయిలో సమన్వయం చేయనున్నారు.

గత మూడేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95 శాతం నెరవేర్చిందని, మేనిఫెస్టోలో చెప్పని కొన్ని అంశాలపై కూడా ప్రజానుకూల నిర్ణయం తీసుకుందని ప్రజలకు వివరించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. గడప గడపకు మన ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం, ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అని అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజక వర్గంలోని పార్టీ ఎమ్మెల్యేలు మే 11వ తేదీ నుండి మండల/మున్సిపాలిటీ మరియు గ్రామ/వార్డు స్థాయిలలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో పాటు అన్ని గ్రామాలను సందర్శించనున్నారు.

అలాగే వాలంటీర్ మెకానిజం సహాయంతో గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ అర్హులకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్స్ అందించడం ద్వారా పారదర్శకంగా మరియు అవినీతి రహితంగా పరిపాలన జరుగుతోందనే భావనను ప్రజలకు తెలియజేయనున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్బీకే వ్యవస్థను రూపొందించామని, దీని ద్వారా మారుమూల గ్రామాల్లోని రైతులకు సైతం సత్వరం సేవలను అందించగలుగుతున్నామని ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తోంది. దీనిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + four =