తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పోటీకి జనసేన కసరత్తు, 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం

Jana Sena's Exercise to Compete in Telangana General Elections Appointed Executives in 32 Constituencies,Janasena To Compete In Telangana Elections, Janasena New Task Managers,Janasena Contenst In 32 Constituencies,Telangana Elections,Telangana General Elections,General Elections In Telangana,Janasena Telangana Elections,Janasena Telangana,Telangana Janasena Elections,Janasena Telangana General Elections,Mango News,Mango News Telugu,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Janasena Party,Janasena Party Chief Pawan Kalyan

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తులు చేస్తుంది. “తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలి” అని ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కార్యవర్గం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాలలో కార్య నిర్వాహకులను ఎంపిక చేసినట్లు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఒక ప్రకటన చేసింది.

నూతన కార్య నిర్వాహకులంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలలో పర్యటించి నివేదిక తయారు చేస్తారని, వారు అందజేసే నివేదికకు అనుగుణంగా ఆయా నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని నేమూరి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరు మహేందర్ రెడ్డి, ఆర్హం ఖాన్, తాళ్లూరి రామ్ అభ్యర్థులను సిద్దం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పని చేసిన వారికి ఎక్కువగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదట విడతగా 32 మందికి కార్య నిర్వాహకులుగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. గతంలో నియమించిన ఆయా కమిటీల అన్నింటిలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు నేమూరి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.

నూతన కార్య నిర్వాహకుల నియామకం:

1.సనత్ నగర్ – మండపాక కావ్య
2. జూబ్లీ హిల్స్ – ఎస్.రమేష్
3. ముషీరాబాద్ – బిట్ల రమేష్
4. కుత్బుల్లాపూర్ – నందగిరి సతీష్ కుమార్
5. కూకట్ పల్లి – నడిగడ్డ నాగేంద్రబాబు
6. మల్కాజ్ గిరి – దామరోజు వెంకట్ చారి
7. ఎల్.బీ.నగర్ – పొన్నూరు లక్ష్మీ సాయి శిరీష
8. శేర్ లింగంపల్లి – చిరాగ్ ప్రజీత్ గౌడ్
9. వైరా – తేజావత్ సంపత్ నాయక్
10. మంచిర్యాల – సైదాల శ్రీనివాస్
11. కంటోన్మెంట్ – కత్తి సైదులు
12. రామగుండం – మూల హరీష్ గౌడ్
13. నాగర్ కర్నూల్ – వంగ లక్ష్మణ్ గౌడ్
14. కొల్లాపూర్ – బైరపోగు సాంబశివుడు
15. ఖమ్మం – మిరియాల రామకృష్ణ
16. కొత్తగూడెం – వేముల కార్తీక్
17. సంగారెడ్డి – కూనా వేణు
18. సత్తుపల్లి – బండి నరేష్
19. అశ్వారావ్ పేట – డేగల రామచంద్రరావ్
20. మునుగోడు – గోకుల రవీందర్ రెడ్డి
21. పఠాన్ చెరువు – యడమ రాజేష్
22. హుజూర్ నగర్ – సరికొప్పుల నాగేశ్వరరావు
23. నకిరేకల్ – చెరుకుపల్లి రామలింగయ్య
24. వనపర్తి – నైని ముకుంద నాయుడు
25. సిద్దిపేట – దాసరి పవన్
26. హస్నాబాద్ – తగరపు శ్రీనివాస్
27. జగిత్యాల – బెక్కం జనార్ధన్
28. స్టేషన్ ఘనపూర్ – గాదె పృథ్వీ
29. నర్సంపేట – మెరుగు శివకోటి యాదవ్

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =