నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

#KCR, 6th Phase Haritha Haram, 6th Phase Haritha Haram Programme, Haritha Haram, Haritha Haram Program, Haritha Haram Program in Telangana, Haritha Haram Programme, KCR Inaugurated Narsapur Urban Forest Park, KCR Started 6th Phase Haritha Haram, Narsapur Urban Forest Park, Telangana CM KCR, Telanganaku Haritha Haram Programme

ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 25, గురువారం నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. 630 ఎకరాల్లో అభివృద్ది చేసిన నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నర్సాపూర్ అడవుల్లో చేపట్టిన అటవీ అడవి పునరుద్ధరణ కార్యక్రమాన్ని సీఎం స్వయంగా పరిశీలించారు. అటవీ ప్రాంతంలో కాలి నడకన తిరుగుతూ అడవి పునరద్దరణ కోసం చేపట్టిన చర్యలను పరిశీలించారు. నేచురల్ ఫారెస్ట్, రాక్ ఫిల్ డ్యాం, వాటర్ హార్వెస్టింగ్ తదితర పనులను పరిశీలించారు. ఎతైన కొండపై నిర్మించిన వాచ్ టవర్ నుండి సీఎం కేసీఆర్ అటవీ ప్రాంతాన్నంతా సందర్శించారు.

గోదావరి నదీ పరివాహక ప్రాంతాలయిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం అడవి ఉందని, ఆ ప్రాంతం కాక దట్టమైన అడవి వున్న ఏకైక ప్రాంతం రాష్ట్రంలో నర్సాపూర్ మాత్రమేనని సీఎం అన్నారు. ఈ అడవిని కాపాడుకోవడానికి, అటవీ ప్రాంతంలో పోయిన అడవిని పునరుద్ధరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − two =