ఈసారి ఆన్‌లైన్ ద్వారా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం

Ganesh, ganesh chaturthi, ganesh chaturthi 2020, Khairatabad, Khairatabad Ganesh, Khairatabad Ganesh 2020, Khairatabad Ganesh Idol, Khairatabad Ganesh Idol 2020, Khairatabad Ganesh Idol Work Begins

వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాల శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అశేష భక్తజనం కోలాహలం మధ్య అత్యంత ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 9 అడుగుల ఎత్తు ఉండే విగ్రహం ప్రతిష్ఠించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ సంవత్సరం శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ విగ్రహానికి ఓ వైపు లక్ష్మిదేవి, మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేస్తునట్టు కమిటీ సభ్యులు ప్రకటించారు.

ప్రభుత్వ పేర్కొన్న నిబంధనల మేరకు ఈ సంవత్సరం విగ్రహాన్ని 9 అడుగులకే పరిమితం చేశామని, అలాగే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం కూడా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, సామూహిక నిమజ్జం నిర్వహించటం లేదని కమిటీ వెల్లడించింది. 11 రోజుల పాటుగా కమిటీ సభ్యులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని, కరోనా కారణంగా దర్శనానికి భక్తులను అనుమతించడం లేదని, భక్తులంతా ఆన్‌లైన్ ద్వారా దర్శనం చేసుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =