తెలంగాణ‌లో కైటెక్స్ గ్రూప్ రూ. 2400 కోట్ల పెట్టుబ‌డి, ప్రత్యక్షంగా 22000 మందికి ఉపాధి

Industries, Kitex Group to invest Rs 2400 cr in Telangana, Kitex Group Will Invest Rs 2400 Cr in Telangana, Kochi-based Kitex Group to invest 2400 crore in Telangana, MA & UD, Mango News, Minister for IT, MoU Signed with Govt in the Presence of Minister KTR, telangana, The Kitex group in Kochi invests 2400 crore, The Kitex group in Kochi invests 2400 crore in Telangana, The Kitex group in Kochi invests in Telangana, The Kitex group invests in Telangana

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కేరళకు చెందిన ప్రముఖ కైటెక్స్ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పిల్లల దుస్తువుల త‌యారీలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న కైటెక్స్ గ్రూప్ రూ.2400 కోట్లతో తెలంగాణలోని వ‌రంగ‌ల్‌లో గల కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో, అలాగే రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం నాడు కైటెక్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు, కైటెక్స్‌ గ్రూప్ చైర్మన్ సాబు జాకబ్, కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు. తెలంగాణలో కైటెక్స్ గ్రూప్ పెట్టుబడుల ద్వారా దాదాపు 22000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన, మరో 18000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభించనున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కేరళ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకున్న కైటెక్స్ సంస్థ వార్త చూసిన తర్వాత నేరుగా కైటెక్స్‌ గ్రూప్ చైర్మన్ జాకబ్ తో మాట్లాడడం జరిగిందని చెప్పారు. ఆ సందర్భంగా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు గల పరిస్థితులు, విధానాలను వివరించడం జరిగిందన్నారు. స్వయంగా తెలంగాణకు వచ్చి పరిశీలించాలని కోరారన్నారు. దీంతో రెండు మూడు రోజుల్లోనే జాకబ్ తెలంగాణకు వచ్చి ఇక్కడి పరిస్థితులను వ్యాపార అనుకూలతను, అవకాశాలు, ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని తమ పెట్టుబడి నిర్ణయాన్ని ప్రకటించారని చెప్పారు. ఒక్క ఫోన్ కాల్ తో ప్రారంభమైన ఈ పెట్టుబడి చర్చలు, ఈరోజు 2,400 కోట్ల రూపాయల పెట్టుబడి, 22000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన, మరో 18000 మందికి పైగా పరోక్ష ఉద్యోగాల కల్పనగా రూపాంతరం చెందిందని చెప్పారు. కేరళలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉన్న కైటెక్స్ గ్రూప్ ను తెలంగాణ రాష్ట్రంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. వరంగల్, రంగారెడ్డిలలో కంపెనీ క్లస్టర్ల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను, తమ ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =