భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలపై సీఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

CS Somesh Kumar held Review on Relief and Rehabilitation Measures in Bhadradri Kothagudem Dist, Telangana CS Somesh Kumar held Review on Relief and Rehabilitation Measures in Bhadradri Kothagudem Dist, Somesh Kumar held Review on Relief and Rehabilitation Measures in Bhadradri Kothagudem Dist, Review on Relief and Rehabilitation Measures in Bhadradri Kothagudem Dist, Relief and Rehabilitation Measures, Bhadradri Kothagudem Dist, CS Somesh Kumar holds teleconference on Relief and Rehabilitation Measures in Bhadradri Kothagudem Dist, teleconference, flood-hit In Bhadradri Kothagudem Dist, Telangana Chief Secretary Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, Somesh Kumar, Bhadradri Kothagudem District News, Bhadradri Kothagudem District Latest News, Bhadradri Kothagudem District Latest Updates, Bhadradri Kothagudem District Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతీ మండలానికి ఒక సీనియర్ అధికారిని నియమించి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. “ప్రతీ గ్రామంలో మెడికల్, విద్యుత్, శానిటేషన్, తదితర విభాగాల బృందాలను ప్రత్యేకంగా నియమించి సమర్థవంతంగా పునరావాస చర్యలను కొనసాగిస్తున్నాం. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 4100 మంది శానిటేషన్ సిబ్బందిని ఇతర జిల్లాల నుండి తరలించి సహాయ పునరావాస చర్యలను చేపట్టాం. మున్సిపల్ శాఖ నుండి 400 మంది శానిటేషన్ సిబ్బంది, మొబైల్ టాయిలెట్లు, ఇతర ఎమర్జెన్సీ సామాగ్రిని తరలించాము. ప్రతీ గ్రామానికి ముగ్గురు, నలుగురు పంచాయితీ కార్యదర్శులను ప్రత్యేకంగా నియమించి శానిటేషన్ కార్యక్రమాలను చేపడుతున్నాం” అని చెప్పారు.

జిల్లా కలెక్టర్ తో పాటుగా పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్, ఆరోగ్య శాఖ డైరెక్టర్, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీ, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతంలు ఈ సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం 436 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య సదుపాయాలు అందచేస్తున్నాము. ఇప్పటి వరకు ఏవిధమైన మలేరియా, డెంగ్యూ కేసులు గానీ నమోదు కాలేదు. ప్రతీ మండలానికి ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, జిల్లా మలేరియా అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నాము. గర్భిణీ స్త్రీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వైద్యసదుపాయం అవసరమైనవారికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాము. ప్రతీ పునరావాస కేంద్రాల్లోనూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసాము. అన్ని గ్రామాల్లో విధ్యుత్ సరఫరా ఈ రోజు రాత్రి వరకు పునరుద్ధరిస్తాము. ప్రతీ మండలానికి ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాము. ఇప్పటివరకు జిల్లా అధికారులు సహాయ పునరావాస చర్యలలో సమర్థవంతంగా పాల్గొనడం పట్ల ప్రజలు అభినందిస్తున్నారు” అని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ టెలీకాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తో పాటుగా మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, విపత్తుల నివారణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 5 =