మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం

Market Committee Act Amendment Bill Approved in Telangana Legislative Council, Amendment Bill Approved in Telangana Legislative Council, Market Committee Act Amendment Bill, Telangana Legislative Council, The Essential Commodities, Amendment Bill, Market Committee Act, 2022-2023 Budget Session, Telangana Budget Session 2022, Telangana Budget Session, TS Budget Session, 2022 Telangana Budget Session, Telangana Assembly Budget Session 2022-23, Telangana Assembly Budget Session 2022, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget, Telangana assembly budget session, Telangana Budget 2022-23, Telangana Budget 2022, Telangana Budget, Telangana Assembly, Telangana Assembly, Telangana Assembly Session, Manog News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లకు, సభ్యుల సంఖ్యను 14 నుండి 18కి, కమిటీలో రైతుల సంఖ్యను 8 నుండి 12కు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా రాష్ట్రంలో వ్యవసాయ ప్రాధాన్యం పెరిగిందని మంత్రి అన్నారు. ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో సభ్యులకు, సభకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మండలిలో జరిగిన చర్చలో సభ్యులు కల్వకుంట్ల కవిత, వెంకట్రామ్ రెడ్డి, గంగాధర్ గౌడ్ లు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ రాష్ట్రంలోనే అన్నివర్గాలకు చెందిన 33 శాతం మంది మహిళలు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎంపికవుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాజ్యంలోనే ఈ అవకాశం లభించిందన్న విషయం గుర్తించాలని కవిత అన్నారు. మార్కెట్ కమిటీల కాలపరిమితిని ఏడాది నుండి రెండేళ్లకు పెంచడం మూలంగా ఆ కమిటీకి మార్కెట్ నిర్వహణ మీద సంపూర్ణ అవగాహన వస్తుందని, మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయమని సభ్యులు గంగాధర్ గౌడ్, వెంకట్రామ్ రెడ్డిలు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + seventeen =