జనవరి 29న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

CM KCR to Held BRS Parliamentary Party Meeting on January 29th ahead of Parliament Budget-2023 Session,BRS Parliamentary Party Meeting,Trs Parliamentary Party Meeting,Trs Member Of Parliament List,Brs Party,Brs Party Membership,Mango News,Mango News Telugu,Parliamentary Committee Meeting Today,Cabinet Committee Meeting Today,Lok Sabha Committee Meeting Schedule,Parliament Meeting Schedule,Parliamentary Committees In India,Committee On Delegated Legislation In India,Committee On Delegated Legislation Upsc,Rajya Sabha Meeting Schedule,Parliamentary Committees Chaired By Speaker,Parliamentary Committees Headed By Speaker,Parliamentary Committees Mcq,Parliamentary Committees Members,Parliamentary Committees Prs,Parliamentary Committees Byjus

పార్లమెంటు బడ్జెట్-2023 సమావేశాలు జనవరి 31, మంగళవారం నాడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఎల్లుండి (జనవరి 29, ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో చర్చించబోయే అంశాలపై, అనుసరించే వ్యూహంపై పార్టీ ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే లోక్‌సభ మరియు రాజ్య సభల్లో తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.

జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 6వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మధ్యలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు. మొత్తం 66 రోజుల పాటుగానడిచే ఈ బడ్జెట్ సెషన్‌లో 27 సిట్టింగ్‌లు ఉంటాయని తెలిపారు. ఇక కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here