‘కంటి వెలుగు’ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరవనున్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు – మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Announces Some Other States CMs will also be Present For The Launching of Kanti Velugu Programme on Jan 18th,Minister Harish Rao,Kanti Velugu Programme,Kanti Velugu-2 Programme,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme Telangana,Telangana Kanti Velugu Programme,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు హాజరు కానున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌ రావు మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో ప్రకటించారు. ఇక ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌ హుస్సేన్, యాదవ రెడ్డి, ఎమ్మెల్యేలు యాదగిరి రెడ్డి, సతీశ్‌, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడే వారికోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండవ దశ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 18వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తామని, దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్ష చేస్తారని మంత్రి వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమం కోసం ప్రతి జిల్లాకు అదనంగా 35మంది వైద్యులను నియమించామని, అలాగే 10లక్షల కళ్ల అద్దాలు ఆయా జిల్లాలకు పంపిణీ చేశామని కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 250కోట్లు కేటాయించామని, జిల్లా వైదాధికారులు దీనిని పర్యవేక్షిస్తారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 1 =