చూసింది కేవలం ట్రైలరే, 2023లో అసలు సినిమా చూపిస్తాం – మంత్రి కేటీఆర్

Minister KTR Visits Sircilla District Today Attends Swearing-in Ceremony of CESS Governing Body,Minister KTR Visits Sircilla,KTR Visits Sircilla District,Attends Swearing-in Ceremony,CESS Governing Body,Mango News,Mango News Telugu,Telangana CM KCR,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కొత్తగా నిర్మించిన మండల ప్రజాపరిషత్ కార్యాలయ భవనాన్ని కూడా ప్రారంభించారు.

అనంతరం సిరిసిల్ల కో-ఆపరేటివ్‌ ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ సొసైటీ (సెస్‌) పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో సెస్ నూత‌న చైర్మ‌న్‌ గా చిక్కాల రామారావు, పలువురు డైరెక్ట‌ర్లు ప్ర‌మాణం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ బోయినపల్లి, ఎమ్మెల్యేలు సుంకే రవి శంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పి చైర్మన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

చూసింది కేవలం ట్రైలరే, 2023లో అసలు సినిమా చూపిస్తాం:

సిరిసిల్ల సెస్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సెస్ చైర్మన్, వైస్ చైర్మన్, 15 మంది డైరెక్టర్ల అందరికి శుభాకాంక్షలు తెలిపారు. సెస్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ పంపిన డబ్బులను బీజేపీ నేతలు పంచుతున్నారని స్థానిక నేతలు ఫోన్లు చేసి చెప్పారని, అయితే రైతులు, సెస్ వినియోగదారులు మంచి చేసిన వాళ్ళని వదిలిపెట్టరని, ఎవరూ భయపడకండి అని చెప్పానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సెస్ ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా స్ఫూర్తినిచ్చిందని అన్నారు. బీజేపీ నేతలు ఎంత ఖర్చు పెట్టినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పనిమంతుడు, తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్ నే మరోసారి ముఖ్యమంత్రిని చేయాలనీ, హ్యాట్రిక్ కొట్టించాలనే బాధ్యత అందరిమీద ఉన్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా దిశా నిర్దేశం చేసిందన్నారు. సెస్ సందర్భంగా చూసింది కేవలం ట్రైలర్ యేనని, 2023లో అసలు సినిమా ఉందని బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 3 =