ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 50 శాతం మెట్టభూముల నుండే, ఇక్రిశాట్ సేవలు అభినందనీయం: మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy Participated in International Conference on Innovations to Transform Dry Lands held at ICRISAT,Minister Niranjan Reddy,Participated in International Conference on Innovations,to Transform Dry Lands held at ICRISAT,ICRISAT,ICRISAT Latest News And Updates,Mango News,Mango News Telugu,DWCRA Women,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

మెట్టభూములను మెరుగుపరిచే అంశంపై ఇక్రిశాట్ లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ సభ్యుడు రమేష్ చంద్, ఇక్రిశాట్ డీజీ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్, ఇక్రిశాట్ డీడీజీ డాక్టర్ అరవింద్ కుమార్ మరియు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మెట్ట భూములను మెరుగు పరచాలని, ప్రస్తుత పరిస్థితులలో ఇది అత్యంత ఆవశ్యకమని అన్నారు. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 50 శాతం మెట్ట భూముల నుండే ఉంటుందని అన్నారు. భూమిపై ఉండే నేలలలో 40 శాతం మెట్ట భూములు కాగా, ఇవి ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నారు.

మెట్టభూములపై పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ సేవలు అభినందనీయం:

“మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆహార భద్రత, జీవవైవిధ్యం, సన్న, చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్టభూముల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ఈ పరిస్థితులలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు మెట్టభూముల పరిస్థితిని మెరుగుపరిచి సుస్థిర వ్యవసాయానికి దారులు వేయాలి. అందులో భాగంగా జరిగే పరిశోధన ఫలితాలు దీర్ఘకాలం పాటు వాతావరణ పరిస్థితులను మారుస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులను సంరక్షించాలి. పర్యావరణ పరిరక్షణకు, పోషక భద్రతకు, పేదల ఆకలి తీర్చడానికి మెట్టభూములపై పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ సేవలు అభినందనీయం. గత 50 ఏళ్లుగా ఇక్రిశాట్ సేవలు ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎందరికో మేలు చేయడం గర్వకారణం. రాబోయే కాలంలో మెట్టభూములు మెరుగు పరిచేందుకు నూతన సాంకేతికతను సృష్టించేందుకు ఈ సదస్సు తోడ్పడుతుందని ఆశీస్తున్నాను. తెలంగాణలో మెట్ట భూములు మెరుగుపరిచే అంశం మీద సదస్సు నిర్వహించడం అభినందనీయం. ఈ సదస్సులో వచ్చే ఫలితాలు జీవ వైవిధ్యానికి ఉన్న ముప్పును, తగ్గుతున్న నేల ఆరోగ్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, కుచించుకు పోతున్న వ్యవసాయ ఉత్పాదతకు సరైన సమాధానాలు రాబడతాయని భావిస్తున్నాను. పరిశోధనలన్నీ నేలలో ఉండే కర్భన శాతాన్ని, నేల జీవ వైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయని నమ్ముతున్నాను. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కలిసి పరస్పర సహకారంతో ఈ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మెట్ట భూముల సమస్యలపై ప్రాంతాల వారీగా నిర్ధిష్ట పరిశోధనా ఫలితాలను విడుదల చేయాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + seven =