ఆటో, క్యాబ్ డ్రైవర్లకు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, సీఎస్ పరిశీలన

COVID 19 Vaccine, COVID-19 vaccine updates, CS Inspected Vaccination Centre, Harish Rao Review over Corona Vaccines Procurement, Mango News, Special Covid Vaccination Drive, Special Covid Vaccination Drive for High Risk Groups, Special Covid Vaccination Drive In Telangana, Special Vaccination Drive, Special Vaccination Drive for Auto Cab Drivers, Special Vaccination Drive for Auto Cab Drivers Started in GHMC, telangana, Telangana launches special vaccination drive, Vaccination Drive for High Risk Groups

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 2 లక్షలకుపైగా డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించనున్నట్లు సీఎస్ తెలిపారు. గురువారం నాడు క్యాబ్, ఆటో డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించే వ్యాక్సినేషన్ సెంటర్ ను సీఎస్ తనిఖీచేశారు.

లైసెన్స్ కలిగిన డ్రైవర్లు రవాణా శాఖ వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సీఎస్ కి వివరించారు. డ్రైవర్ల మొబైల్ కు మెసేజ్ వస్తుందని, మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్ లోకి అనుమతి ఇస్తున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో కొవిన్ పోర్టల్ లో డ్రైవర్ల రిజిస్ట్రేషన్ చేస్తారని, నేరుగా వచ్చే వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం రవాణాశాఖ చేపట్టిన సదుపాయాల పట్ల సీఎస్ సోమేశ్ కుమార్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రవాణా శాఖ కమీషనర్ యం.ఆర్.యం.రావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =