సంక్షేమానికి చిరునామాగా కేసీఆర్ ప్రభుత్వం – మంత్రి హరీష్ రావు

100 Bedded Hospital At Sathupally, Finance Minister Harish Rao, Harish Rao Lays Foundation Stone For 100 Bedded Hospital, Health Minister Harish Rao, Khammam, Laying Foundation Stone for 100 Bedded Hospital, Laying Foundation Stone for 100 Bedded Hospital at Sathupally, Mango News, Minister Harish Rao, Minister Harish Rao Lays Foundation Stone For 100 Bedded Hospital At Sathupally, Minister Harish Rao Lays Foundation Stone For 100 Bedded Hospital At Sathupally Khammam, Sathupally

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు (శనివారం) సత్తుపల్లిలో హరీష్‌రావు పర్యటించారు. వంద పడకల ఆస్పత్రికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం హరీష్‎ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కిట్‎లు వచ్చిన తర్వాత వందశాతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీలు పెరిగాయన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేశామని చెప్పారు. ఇప్పటివరకు ఈ కళ్యాణ లక్ష్మీ పథకం కింద 10 లక్షల పెళ్లిళ్లు జరిగాయని తెలిపారు.

దేశంలో సంక్షేమ ప్రభుత్వానికి చిరునామాగా కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ తర్వాత ఒక్క ఖమ్మంలోనే కేతల్యాబ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే బాగా జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే కిట్లతో ఎంతోమందికి ఉపశమనం కలుగుతోందని మంత్రి తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. ప్రజల సహకారం ఉంటే త్వరలోనే కరోనా వేవ్ నుండి బయటపడవచ్చని హరీష్ రావు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here