అమ్మా క్వారంటైన్ వల్ల నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా.. మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi mother, chiranjeevi mother anjana devi, chiranjeevi mother date of birth, chiranjeevi mother date of birth year, chiranjeevi mother name, Chiranjeevi Wishes His Mother Anjana Devi With Emotional Post on Her Birthday, chiru mother anjana devi age, Covid positive Chiranjeevi pens emotional note on mom Birthday, Mango News, Megastar Chiranjeevi, megastar chiranjeevi mother age, Megastar Chiranjeevi shares emotional post on his mother, Megastar Chiranjeevi Wishes His Mother Anjana Devi, Megastar Chiranjeevi Wishes His Mother Anjana Devi With Emotional Post, Megastar Chiranjeevi Wishes His Mother Anjana Devi With Emotional Post on Her Birthday

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి.. సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా బారిన పడక తప్పలేదంటూ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ప్రస్తుతం ఆయన క్యారంటైన్‏లో ఉంటూ వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఈ క్రమంలో ఆయన ఈరోజు కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే, ఈరోజు (జనవరి 29) ఆయన తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజు వేడుకలను దగ్గరుండి ఘనంగా జరిపించేవారు చిరంజీవి. కానీ, ఈ ఏడాది కరోనా కారణంగా తన తల్లిని కలుసుకోలేకపోయారు.

అందుకే, చిరంజీవి తన తల్లికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ” అమ్మా !.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. క్వారెంటైన్ కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేకపోతున్నాను. అందుకే నీకు శుభాకాంక్షలు ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు, మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. అభినందనలతో …. శంకరబాబు.” అంటూ ట్వీట్ చేసారూ. దానితోపాటు భార్య సురేఖ.. తల్లి అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు చిరంజీవి. ఈమధ్యే  మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో కాజల్, పూజా హెగ్డే, రామ్ చరణ్ కీలకపాత్రలలో నటించారు. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం చిరంజీవి.. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here