తునికాకు సేకరణదారులకు బోనస్ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister Indrakaran Reddy Started Distribution of Beedi Leaf Net Revenue to the Beedi Leaf Collectors in Sirpur Constituency,Minister Indrakaran Reddy,Started Distribution of Beedi Leaf,Beedi Leaf Net Revenue,Beedi Leaf Collectors,Beedi Leaf Sirpur Constituency,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తునికాకు సేకరణదారులకు బోనస్ చెల్లింపు ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం సిర్పూర్ నియోజవర్గంలోని కర్జెల్లి అటవీ రేంజ్ చింతలమానేపల్లిలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోనేరు కొనప్ప, ఆత్రం సక్కు, పీసీసీఎఫ్ అండ్ హెఛ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, సీసీఎఫ్ వినోద్ కుమార్, కలెక్టర్ హేమంత్ బొర్కడే, జిల్లా అటవీ అధికారి ఆశీష్ సింగ్, ఎఫ్డీవో విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, తునికాకు సేక‌రించే కూలీల‌కు ల‌బ్ధి చేకూర్చాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం తునికాకు సేక‌ర‌ణ చార్జీల‌తో పాటు రెవెన్యూ నెట్ షేర్ (బోన‌స్) ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.

“సేకరించిన తునికాకును అమ్మగా వచ్చిన ఆదాయాన్ని తిరిగి సేకరణ దారులకే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ గ్రామాలకు ఇది ఉపాధి వనరు. రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.200 కోట్లను బోన‌స్ (నెట్ రెవెన్యూ) చెల్లిస్తున్నాం. బీడీ ఆకుల సేకరణ రేట్ పెంచుతూ (జీవో నెం.15) జారీ చేశాం. కట్టకు రూ.2.05 పైసల నుంచి రూ.3 కు పెంచినాము. ఈ సీజన్ నుంచి ఈ రెట్లు వర్తింపజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.277.88 కోట్లను బోన‌స్ ( నెట్ రెవెన్యూ) చెల్లింపు ప్ర‌క్రియ ప్రారంభించాం. లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే బోనస్ డబ్బులు జమ చేస్తాం. ఈ సీజన్ లో తునికాకు సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సీజ‌న్ లో 2.27 ల‌క్ష‌ల స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకును సేక‌రించి, అమ్మాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించాము. మే నెల చివరి వరకు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం. సీజ‌న్ లో దాదాపుగా 75 వేల మంది తునికాకు సేక‌ర‌ణ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. 2023వ సంవ‌త్స‌రం తునికాకు సీజ‌న్ లో రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో 225 యూనిట్ల‌లో తునికాకును అట‌వీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో అట‌వీ శాఖ విక్ర‌యిస్తుంది. సిర్పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో తునికాకు కూలీల‌కు రూ.31.58 కోట్ల బోన‌స్ ను చెల్లించే ప‌క్రియ‌ను ఈరోజు ఇక్క‌డి నుంచే ప్రారంభిస్తున్నాము. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 63,573 మంది లబ్దిదారులకు రూ.31.58 కోట్లు చెల్లిస్తుండగా, ఒక్క సిర్పూర్ నియోజకవర్గంలోనే 48,418 మంది లబ్ధిదారులకు రూ.26.98 కోట్లు చెల్లిస్తున్నాం” అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + ten =