పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వారు ఎవ‌రైనా స‌రే వ‌దిలిపెట్టేది లేదు – మంత్రి కేటీఆర్

Minister KTR Responds Over Warangal KMC PG Medical Student Preethi Demise Issue,Warangal Police on Student Suicide, Medical Student Suicide, Cause Of Medical Student Suicide, Warangal Police Says Targeted Harassment, Targeted Harassment Of Medical Student, Mango News, Mango News Telugu,Warangal Police Commissionerate Website,Warangal Commissioner Of Police Contact Number,Warangal Commissionerate Police Stations,Warangal District Police Officers List,Warangal Mahila Police Station,Warangal Mattewada Police Station,Warangal Mattewada Police Station Si Name,Warangal Police Ci List,Warangal Police Commissioner,Warangal Police Commissioner Address,Warangal Police Commissioner Email Address,Warangal Police Commissionerate,Warangal Police Commissionerate Address,Warangal Police Commissionerate Districts,Warangal Police Commissionerate Map,Warangal Police Commissionerate Phone Numbers,Warangal Police Officers Names,Warangal Police Si List,Warangal Police Station

వ‌రంగ‌ల్ ఎంజీఎంలో పీజీ చ‌దువుతున్న డాక్ట‌ర్ ప్రీతికి అన్యాయం చేసిన వారు ఎవ‌రైనా స‌రే వ‌దిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ఆయన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 125 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. అనంతరం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగిస్తూ ప్రీతి మరణంపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీలో జ‌రిగిన సంఘటనల వలన మ‌న‌స్తాపానికి గురైన ప్రీతి దుర‌దృష్టావ‌శాత్తూ ఆత్మహత్యకు పాల్పడిందని, అయితే దీనిని ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న రాజ‌కీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సభా వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి త‌మ పార్టీ తరపున మరియు ప్ర‌భుత్వం త‌ర‌ఫున మ‌న‌స్ఫూర్తిగా సంతాపం ప్ర‌క‌టిస్తున్నామని, అలాగే వారి కుటుంబానికి అండ‌గా ఉంటామని కూడా తెలిపారు.

ఇంకా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రీతి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ప్రభుత్వం తరపున బాధ్యతగా మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్, ఎంపీ క‌విత వెళ్లి ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారని, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. ప్ర‌తి చిన్న అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పద్దతి కాద‌ని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఇక ఈ సంద‌ర్భంగా అందరికీ ఒకటి స్పష్టం చేయదలుచుకున్నామని, ప్రీతికి అన్యాయం చేసిన వాడు ఎవ‌డైనా స‌రే.. వాడు సైఫ్ కావొచ్చు, సంజ‌య్ కావొచ్చు వ‌దిలిపెట్టేది లేదని చ‌ట్ట‌ప‌రంగా శిక్ష వేస్తాం అని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీజేపీని విమర్శిస్తే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారని, అయితే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి దాడులకు భయపడేది కాదని, ఎందాకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. రైతు బంధు, దళిత బంధు, క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్, ఆస‌రా పెన్ష‌న్లు, కేసీఆర్ కిట్, ప‌ల్లె ప్ర‌గ‌తి వంటి పథకాలు, కార్యక్రమాల ద్వారా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. 4 కోట్ల మంది ప్రజలు మా కుటుంబ సభ్యులేనని, జ‌న‌హిత‌మే మా అభిమ‌తం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =