సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి బాటపడుతున్న గ్రామాలు -మంత్రి కొప్పుల

Minister Koppula Eshwar Lays Foundation For Several Development Works In Peddapalli District,Villages Are Developing, Rural Development Introduced By Cm Kcr, Minister Koppula,Mango News,Mango News Telugu,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Minister Koppula Eshwar,Lays Foundation For Development Works,Peddapalli District

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ధర్మారం మండలం సాయన్నపేట గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించే నూతన పాఠశాల భవన నిర్మాణ పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో దాదాపు కోటి 63 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సంఘ భవనాల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బొట్లవనపర్తి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పొందిన 52 మంది లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికెట్ లను మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

సీఎం కేసీఆర్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన సంక్షేమ పాలన అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కేసీఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కొప్పుల తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో పచ్చదనం పారిశుధ్యం పెంపొందించామని, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విధానాలు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్యాస్ సిలిండర్ ధరలను, పెట్రోల్, డీజిల్ పై కేంద్ర పన్నులు గణనీయంగా పెంచడం, ఆహార పదార్థాలు, పాలుపై జీఎస్టీ విధించడం వల్ల ప్రజలు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =