శబరిమల యాత్రికులకు శుభవార్త.. విమానాల్లో తమవెంట ‘ఇరుముడి’ తీసుకెళ్లడానికి అనుమతి

Bcas Allows Sabarimala Pilgrims To Carry Coconuts In Cabin Baggage In Flights Upto Jan 20,Good News For Sabarimala Pilgrims,Irumudi On Flights,Sabarimala Pilgrims,Sabarimala Latest News And Updates,Sabarimala Pilgrims Irumudi,Irumudi,Mango News,Mango News Telugu,Bureau Of Civil Aviation Security,Bcas News And Updates,Sabarimala,Sabarimala Ayappa,Sabarimala International Airport,Sabarimala Temple,Sabarimala Darshan,Sabarimala Darshan Online Booking,Sabarimala News Today Live,Sabarimala Latest News

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. ఇకపై వారు తమవెంట విమానాలలో ‘ఇరుముడి’ (కొబ్బరికాయ, నెయ్యి మరియు ఇతర పూజాద్రవ్యాలు) తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ (బీసీఏఎస్) నిర్ణయించింది. దీంతో ఇకపై భక్తులు విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీలో కొబ్బరికాయలను (ఇరుముడులను) తీసుకెళ్లడానికి అనుమతించనున్నారు. దేశవ్యాప్తంగా దేనిని అమలు చేస్తున్నట్లు బీసీఏఎస్ స్పష్టం చేసింది. అయితే దీనికి ముందుగా విమానాశ్రయాలలో భద్రతా తనిఖీలు నిర్వహించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కొబ్బరికాయలను చెక్-ఇన్ బ్యాగేజీలో వేయమని భక్తులకు సూచించనుంది. క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించిన మీదట వాటిని అనుమతించనున్నారు. అలాగే దీనికి సంబంధించి దేశంలోని అన్ని విమానాశ్రయాల భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే ఈ అవకాశం మండలం దీక్షలు మరియు మకరజ్యోతి దర్శనం పూర్తయ్యేవరకు, అనగా 20 జనవరి, 2023 వరకు మాత్రమే ఉంటుంది. అలాగే మండే స్వభావం ఉన్న పూజాద్రవ్యాలను మాత్రం అనుమతించరు. కాగా బీసీఏఎస్ ప్రకటించిన ఈ నిబంధనపై అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 8 =