తెలంగాణ హౌస్‌ నుంచి ఈ ఏడాది హజ్‌యాత్రకు 7 వేల మంది యాత్రికులు – మంత్రి కొప్పుల ఈశ్వర్‌

Minister Koppula Eshwar Says Around 7000 Pilgrims Will Go For Hajj From Telangana House This Year,Minister Koppula Eshwar,Around 7000 Pilgrims Will Go For Hajj,Pilgrims Will Go For Hajj From Telangana House,Pilgrims Will Go For Hajj This Year,Mango News,Mango News Telugu,Minister Koppula Eshwar About Hajj Pilgrims,Minister Koppula Eshwar Latest News,Minister Koppula Eshwar Latest Updates,Minister Koppula Eshwar Live News,Hajj Pilgrims Latest News,Hajj Pilgrims Latest Updates,Telangana Hajj Pilgrims Latest News,Telangana Hajj Pilgrims Latest Updates

ఈ ఏడాది తెలంగాణ హౌస్‌ నుంచి దాదాపు 7 వేల మంది యాత్రికులు హజ్‌ పవిత్ర యాత్రకు వెళ్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని హజ్‌ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో హజ్‌యాత్ర ఏర్పాట్లపై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, హజ్‌ కమిటీ చైర్మన్‌ మహమ్మద్‌ సలీం, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ మసీఉల్లాఖాన్‌, మైనార్టీ కార్పొరేషన్‌ ఉన్నతాధికారి షఫీ ఉల్లాఖాన్‌, ఎయిర్‌పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, కార్పొరేటర్‌ రేఖ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. హజ్‌ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని, జూన్‌ 5 తేదీ నుంచి హజ్‌ చార్టర్‌ విమానాలు నడుపుతారని పేర్కొన్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, దీనిలో భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్‌ సౌకర్యం ఏర్పాటు చేశారని చెప్పారు. యాత్రికుల కోసం డయాస్‌, సిట్టింగ్‌ ఏర్పాట్లు, బస్‌ పాయింట్లు దిగడం, సామాను స్రీనింగ్‌, చెక్‌-ఇన్‌ కౌంటర్లు మొదలైనవి హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌, యాత్రికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here