సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం.. త్వరలో నూతన సచివాలయం సమీపంలో భారీ ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం

CM KCR Plans For The Construction of Huge Twin Towers Near New Secretariat For HOD Offices,CM KCR Plans For The Construction of Huge Twin Towers,Twin Towers Near New Secretariat,Huge Twin Towers For HOD Offices,Mango News,Mango News Telugu,KCR plans twin towers,Twin Towers To Be Constructed For Heads,Twin Towers for govt dept heads,KCR wants twin towers to bring HoDs,CM KCR Latest News,CM KCR Latest Updates,CM KCR Live News,Twin Towers Near Secretariat Latest News,Telangana Latest News,Telangana Latest Updates,Twin Towers News Today

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్‌వోడీ) సచివాలయంలో పని నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ సోమవారం ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల్లోని హెచ్‌వోడీలు, వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి సమీపంలో విశాలమైన ప్రభుత్వం స్థలాలు ఎక్కడెక్కడున్నాయో ఆరా తీశారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్‌వోడీల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ట్విన్‌ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. సమీకృత సచివాలయం తరహాలోనే సమీకృత హెచ్‌వోడీల కార్యాలయాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించారు.

ఇక సమీక్షా సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ అమర వీరుల స్మారకం వద్దకు చేరుకున్నారు. అకడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. విగ్రహానికి రెండువైపులా అత్యద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్‌ శశిధర్‌ను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =