వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనది, పెద్దయ్యాక నేను డాక్టర్‌ కావాలని మా అమ్మ కోరుకుంది – మంత్రి కేటీఆర్‌

Minister KTR Attends For The Women in Medicine Conclave at AIG Hospital Hyderabad Today,Women in Medicine Conclave,AIG Hospital Hyderabad,Women in Medicine Hyderabad Conclave,Mango News,Mango News Telugu,Minister KTR Attends Medicine Conclave,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, ప్రాణాలు కాపాడగలిగే గొప్ప నైపుణ్యం వారి సొంతమని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. శనివారం ఆయన హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో జరిగిన ‘ఉమెన్‌ ఇన్‌ మెడిసిన్‌ కాంక్లేవ్‌’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంచుకోవాలంటే వ్యక్తిగత అభిలాషతో పాటు ఎంతో అంకితభావం కూడా ఉండాలని తెలిపారు. తాను ఎంతోమంది వైద్యులను చూశానని, వారు తమ వృత్తికోసం కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేస్తారని కొనియాడారు. ఎప్పుడు ఎవరికీ ప్రాణమీదకు వస్తుందో తెలియదని, అనుక్షణం సేవకు అంకితమవడం వల్లే వారు ప్రాణాలు నిలబెట్టగలుగుతున్నారని అన్నారు. ఇక సాధారణంగా అందరి కుటుంబాల్లో తమ పిల్లల్లో ఒకరు డాక్టర్ అవ్వాలని కోరుకోవడం సహజమని, అలాగే తమ కుటుంబంలో తాను డాక్టర్‌ కావాలని తమ తల్లి కోరుకుందని తెలిపారు.

ఇక దేశంలో జెండర్ ఈక్వాలిటీ పాటించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు మంత్రి కేటీఆర్‌. మహిళా సాధికారతకు టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, సీఎం కేసీఆర్ ఈ విషయంలో స్పష్టం ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఆర్ధిక స్వావలంబన కోసం చేయూత అందిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో వారికోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారని తెలియజేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఏఐజీ ఆసుపత్రి విశేష సేవలు అందించిందని, నాణ్యమైన వైద్యంతో పాటు నిపుణులైన వైద్య బృందం వారి సొంతమని పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, వైద్య రంగంలో కూడా వారు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here