మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రేపు “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం

Minister KTR Birthday : Mukkoti Vruksharchana Program To be Held Tomorrow Across the Telangana

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ జన్మదినమైన జూలై 24న “ముక్కోటి వృక్షార్చన” ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు, ఒకే గంటలో మూడుకోట్ల మొక్కలు నాటే కార్యక్రమం జరగనుంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే ఈ ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్ణయించింది.

రేపు మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయాలి. యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్ కు జీఐసీ (GIC) అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్ తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్ లోడ్ చేయాలి. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు, హరితహర సంకల్పంలో మీ కృషికి గుర్తింపుగా మంత్రి కేటీఆర్ దగ్గరనుంచి వనమాలి బిరుదు ఈ-మెయిల్ లేదా మొబైల్ కు వారం రోజుల్లో ఎవరికివారికి పంపించబడుతుందని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగే ఈ ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటాలని రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖ సినీ నటీనటులు, క్రీడాకారులు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 8 =