గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు ‘యునెస్కో’ పురస్కారాలు – మంత్రి కేటీఆర్ హర్షం

Minister KTR Congratulates Over Golconda Stepwell and Domakonda Fort Gets UNESCO Awards,Golconda Stepwell,Domakonda Fort,UNESCO Awards,Minister KTR Congratulated,Mango News,Mango News Telugu,UNESCO Awards For Golkonda Stepwell,UNESCO Awards For Domakonda Fort,UNESCO Latest News And Updates,Golconda Stepwell Route Map,Golconda Fort News and Updates,Domakonda Fort News And Live Updates

తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీ కింద అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న ‘గోల్కొండ మెట్లబావి’ ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’, కామారెడ్డి జిల్లాలోని ‘దోమకొండ కోట’ ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ కేటగిరీలో ఎంపికయ్యాయి. ఈ రెండింటితో పాటు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు అరుదైన అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, దేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్‌ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ లభించాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ కట్టడాలకు యునెస్కో పురస్కారాలు ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీనిని గురించి ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా అన్నారు.. ‘తెలంగాణలోని అందమైన మెట్ల బావులు మరియు వాటి పునరుద్ధరణ పనులు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ యునెస్కో విశిష్ట పురస్కారంతో గుర్తించబడింది. ఇక తదుపరి లక్ష్యం, చారిత్రాత్మక మరియు అందమైన నగరమైన హైదరాబాద్ ‘వరల్డ్ హెరిటేజ్ సిటీ’ హోదాను పొందడమే’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − four =