హైదరాబాద్‌లో 207 కోట్లతో టీబీ కిట్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్‌

Minister KTR Davos Tour EMPE Diagnostics To Invest Rs 207 Cr For Manufacturing TB Kits in Hyderabad, EMPE Diagnostics To Invest Rs 207 Cr For Manufacturing TB Kits in Hyderabad, EMPE Diagnostics To Invest Rs 207 Cr In Telangana, Manufacturing TB Kits in Hyderabad, Manufacturing TB Kits, EMPE Diagnostics, TB Kits, KTR Davos Tour, Minister KTR Davos Tour, Minister KTR Davos Tour News, Minister KTR Davos Tour Latest News, Minister KTR Davos Tour Latest Updates, Minister KTR Davos Tour Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

దావోస్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా స్వీడన్‌ దేశానికి చెందిన ‘ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్’ సంస్థ హైదరాబాద్‌లో 207 కోట్లతో క్షయవ్యాధి (టీబీ) కిట్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. నగరం లోని జీనోమ్ వ్యాలీలో నెలకు 2 మిలియన్ల టీబీ డయాగ్నస్టిక్ కిట్‌లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో తమ గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ సీఈవో మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ పవన్ తో మంత్రి కేటీఆర్‌ సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ” పురాతన అంటువ్యాధులలో క్షయవ్యాధి ఒకటని.. నేటికీ, వైద్య ప్రపంచానికి ఇది సవాలుగా మిగిలిపోయింది, ఇది దేశాలకు సామాజిక-ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ కోసం గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా హైదరాబాద్ ఉపయోగపడుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కంపెనీ ముందుగా రూ. 25 కోట్లు పెట్టుబడితో నెలకు 20 కిట్ల వరకు తయారు చేయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈవో డాక్టర్‌ పవన్‌ అసలాపురం మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. దీనిద్వారా దాదాపు 25 మందికి ఉపాధి కల్పించనున్నామని, త్వరలోనే మరో రూ.50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =