చదువుల తల్లికి మంత్రి కేటీఆర్ అండ, ఐఐటీ విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ

KTR Extends Financial Assistance to Tribal Girl, KTR Extends Financial Assistance to Tribal Girl Pursuing Engineering, KTR helps tribal student aim high, KTR helps tribal student to pursue education in IIT, Mango News, Minister KTR, Minister KTR Extends Financial Assistance to Tribal Girl Pursuing Engineering, Minister KTR Extends Financial Assistance to Tribal Girl Pursuing Engineering at IIT, Support pours in for tribal girl after KTR’s tweet, Telangana Minister KTR helps tribal student to pursue IIT

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గోప్ప మనసును చాటుకున్నారు. ఐఐటీలో సీటు సాధించి, ఫీజు చెల్లించడానికి డబ్బులేక ఇబ్బంది పడుతున్న ఓ యువతికి తన సొంత నిధులతో ఐఐటీ విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థిని కారం శ్రీలత ప్రతిష్టాత్మక ఐఐటీలో స్థానం సంపాదించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెంకు చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. తన నిరుపేద పరిస్థితులను దాటుకుని ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్ కర్నూల్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ-జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటి వారణాసిలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించింది. అయితే వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. ఇప్పటిదాకా పూర్తిస్థాయి ప్రభుత్వ విద్యను అభ్యసించిన శ్రీలతకి ఐఐటి ఫీజులు చెల్లించేందుకు మార్గం లేక తన ఉన్నత విద్య స్వప్నం చెదిరి పోతుందేమోనని ఇబ్బందులు పడుతున్న శ్రీలత పరిస్థితి మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆయన తన సొంత నిధులతో శ్రీలత ఐఐటీ విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో శ్రీలతను అభినందించారు. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

అత్యంత నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం లక్షలాది మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఏలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. శ్రీలత లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యకు అవసరమైన డబ్బులను అందించారు. భవిష్యత్తులోనూ శ్రీలతకు అండగా నిలుస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐటీలోనూ మరింత ప్రతిభ చాటాలని అభినందించారు. తమ కుటుంబ ఆశ శ్రీలతకు, ఆమె విద్యాభ్యాసానికి మంత్రి కేటీఆర్ అండగా నిలవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =