రాష్ట్రపతి భవన్ ​లో ఘనంగా 2021 పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Mango News, P V Sindhu Awarded Padma Bhushan, padma awards, Padma Awards 2020, Padma Awards 2020 And 2021, Padma Awards 2021, President Kovind, President Kovind Confers Padma Bhushan Awards, President Kovind Confers Padma Bhushan Awards for 202, President Kovind confers top honours at Rashtrapati Bhavan, President Kovind gives Padma awards, President Ram Nath Kovind Gives Awards To Awardees

దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ​లో ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2021 సంవత్సరానికి గానూ పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హెంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం ఉదయం సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా మొదటి సెట్ అవార్డులు ప్రదానం చేయగా, ఈ రోజు సాయంత్రం సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-IIలో రెండవ సెట్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

2021 అవార్డుల్లో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించారు. అలాగే ప్రముఖ సినీగాయని చిత్ర పద్మభూషణ్‌ అవార్డు పొందారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఒకరికి పద్మ అవార్డులు లభించాయి. ఏపీ నుంచి కళారంగంలో సేవలకు గానూ రామస్వామి అన్నవరపు, సాహిత్యం, విద్య రంగంలో ప్రకాశ్‌రావు అసవడి, కళారంగంలో నిడుమోలు సుమతి పద్మ అవార్డులు పొందారు. ఇక తెలంగాణ నుంచి కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ అవార్డు దక్కింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 7 =