దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: జనవరి 16 నుంచి ప్రారంభానికి కేంద్రం నిర్ణయం

Centre Decides to Start Corona Vaccination Drive, Corona Vaccination Drive, coronavirus vaccine distribution, Coronavirus Vaccine Distribution In India, COVID 19 Vaccine, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Coronavirus Vaccine Distribution, Mango News, Nationwide COVID 19 Vaccine Distribution, Vaccine Distribution

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని కేంద్రం వెల్లడించింది. ముందుగా సుమారు 3 కోట్ల హెల్త్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అందించబడుతుందని తెలిపారు. ఆతర్వాత సుమారు 27 కోట్ల మంది 50 ఏళ్లు పైబడిన వారు మరియు 50 ఏళ్లలోపు అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్టు పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై రాష్ట్రాలు/కేంద్రపాలితాల ప్రాంతాల సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశం నిర్వహించారు. చర్చ అనంతరం కరోనా వ్యాక్సిన్ పంపిణీపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

దేశంలో అత్యవసర వినియోగానికి సంబంధించి కోవిషిల్డ్, కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జనవరి 3 న షరతులతో కూడిన ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం అమలు చేయడంలో యంత్రాంగం సమర్ధత తెలుసుకునేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రెండు విడతలుగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం)ను కూడా నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here