హైదరాబాద్ లో 3000 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్ ప్రారంభం : మంత్రి కేటీఆర్

Free Internet Services, Free Internet Services 3000 WiFi Hotspots In Hyderabad, Hyderabad has largest free public wi-fi network, KTR launches 3000 public Wi-Fi hotspots, KTR Launches Free Internet Services, KTR Launches Free Internet Services 3000 WiFi Hotspots In Hyderabad, KTR to launch Free Wi-Fi project, Mango News, Minister KTR launches 3000 free public Wi-Fi hotspots, public Wi-Fi hotspots in Hyderabad, Telangana Rashtra Samithi, TRS Working President KTR

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం నాడు హైదరాబాద్ లో 3000 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్‌ లను ప్రారంభించారు. హై-ఫై ప్రాజెక్ట్‌లో భాగంగా యాక్ట్ ఫైబర్‌నెట్ సహకారంతో ప్రభుత్వం ఈ ఉచిత వైఫై సౌకార్యాన్ని నగరంలోని మూడు వేల ప్రదేశాల్లో కల్పిస్తుంది. ఆయా ప్రదేశాల్లో 25 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రోజుకు 1 జీబీ పరిమితితో 45 నిమిషాల పాటుగా ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. బుధవారం సాయంత్రం బేగంపేటలోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటుగా జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈఓ బాల మల్లాది, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టుతో భారతదేశంలో అతిపెద్ద ఉచిత వైఫై నెట్‌వర్క్ కు హైదరాబాద్ నిలయం మారిందని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తున్న యాక్ట్ ఫైబర్‌నెట్‌ని మంత్రి కేటీఆర్ ప్రశంసిస్తూ, వైఫైని అందుబాటులోకి తెచ్చిన సీఈఓ బాల మల్లాదికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నగరంలో ఉచిత వైఫై పనితీరుకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి మంత్రి కేటీఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =