జులై నాటికి హైద‌రాబాద్‌లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తాం – మంత్రి కేటీఆర్

Minister KTR Participates The Launch of Lakes Development Program at Khajaguda Lake Hyderabad Today,Minister KTR Participate Lakes Development Program,Lakes Development Program at Khajaguda,Khajaguda Lake Hyderabad Today,Lakes Development Program Launch,Mango News,Mango News Telugu,KTR Live,Minister KTR Participate in Launch,Minister Sri. KTR Participating in Launch of Lakes,Minister KTR Latest News And Updates,Telangana Latest News,Telangana Latest Updates,Lakes Development Program Latest Updates

జులై నాటికి హైద‌రాబాద్‌లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తామని ప్రకటించారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన చెరువుల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) నిధులతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 25 చెరువులు, అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలోని మరో 25 చెరువుల అభివృద్ధికి వివిధ నిర్మాణ రంగ సంస్థ‌లు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు మంత్రి కేటీఆర్ ఒప్పంద ప‌త్రాల‌ను అందించారు. నగరంలోని ఖాజాగూడ చెరువు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో క్రెడాయి ప్రెసిడెంట్‌ రామకృష్ణారావు, నరెడ్కో ప్రెసిడెంట్‌ సునీల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రానికి నాలుగు శతాబ్దాలకు పైగా ఘన చ‌రిత్ర ఉందని, నగరంలో 94 శాతం నీళ్లు గ్రావిటీ ద్వారా మూసీలో క‌లుస్తున్నాయని తెలిపారు. వచ్చే జులై నాటికి హైద‌రాబాద్‌లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేయనున్నట్లు చెప్పిన ఆయన తద్వారా దేశంలోనే వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే న‌గ‌రంగా హైద‌రాబాద్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక 1908లో హైద‌రాబాద్‌లో మూసీ న‌దికి వ‌ర‌ద‌లు వ‌చ్చిప్పుడు, నాటి నిజాం నవాబు అప్పటి ఇంజినీర్లలో ప్రముఖుడైన మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌ను పిలిపించారని, భ‌విష్య‌త్‌లో వ‌ర‌ద‌ల ముప్పు రాకుండా ప్రణాళికలు రూపొందించాలని కోరిన మీదట హిమాయాత్ సాగ‌ర్, ఉస్మాన్ సాగ‌ర్ వంటివి నిర్మితమయ్యాయని చరిత్ర గురించి వివరించారు.

ఇక జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలో దాదాపు 155 చెరువులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2000 సంవ‌త్స‌రం నుంచి 5 ద‌శల్లో చెరువుల శాటిలైట్ మ్యాప్స్ తీశామని, అయితే హైద‌రాబాద్‌లోని చాలా చెరువుల్లో ప్రైవేటు ప‌ట్టాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకే ఆయా ప్రైవేటు భూముల య‌జ‌మానుల‌కు మ‌రో చోట భూమి అందిస్తున్నామని, దీంతో పాటు టీడీఆర్ కింద 200 శాతం విలువ క‌ల్పిస్తున్నామని కూడా స్పష్టం చేశారు. అలాగే ఆఫీస్ స్పేస్ ఆక్యుపేష‌న్‌ అంశంలో హైద‌రాబాద్ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని, ప్ర‌పంచానికే వ్యాక్సిన్ క్యాపిట‌ల్‌గా నిలిచిందని ప్రశంసించారు. ఈ క్రమంలో హైద‌రాబాద్ లోని ఫార్మా ఇండ‌స్ట్రీ 2030 నాటికి 250 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసిన మంత్రి కేటీఆర్ రానున్న రోజుల్లో హైద‌రాబాద్‌లో మెట్రో లైన్ 250 కిలోమీట‌ర్ల‌కు విస్త‌రిస్తామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + six =