టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన పొలిట్ బ్యూరో సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

TDP Chief Chandrababu Held Party Politburo Meeting in NTR Trust Bhavan Takes Several Key Decisions,TDP Chief Chandrababu Held Party Politburo Meeting,TDP Chief Chandrababu in NTR Trust Bhavan,TDP Chief Chandrababu Takes Several Key Decisions,Mango News,Mango News Telugu,TDP Polit Bureau meeting begins,TDP Chief Chandrababu Latest News,TDP Chief Chandrababu Live Updates,NTR Trust Bhavan Latest News,TDP Party Politburo Meeting News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అయింది. మంగళవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి 13, తెలంగాణకు సంబంధించి 4 అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అకాల వర్షాలు, పంట నష్టం, రైతులు ఇబ్బందులు, రాష్ట్రంలో అమలుకాని ప్రభుత్వ హామీలు, సభ్యత్వ నమోదు వంటి అంశాలపై చర్చించారు. అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రేపు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపట్టనున్న భారీ బహిరంగ సభ నిర్వహణపై కూడా చర్చించారు. ఇక సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు రెండు రాష్ట్రాల నేతలకు కీలక సూచనలు చేశారు.

టీడీపీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇవే..

  • ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని నిర్ణయం.
  • ఆర్ధిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా మ్యానిఫెస్టో రూప కల్పన చేయాలని నిర్ణయం.
  • పేదలకు ఇప్పుడు అందుతున్న దానికంటే రెట్టింపు సంక్షేమం అందించేందుకు అధ్యయనం చేయాలని నేతలకు సూచన.
  • టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడును మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయం.
  • ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఏప్రిల్ ఆఖరి వరకూ నిర్వహించేందుకు నిర్ణయం.
  • ఆంధ్రా, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి (నవంబర్‌లో) ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా.
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్, లీడర్‌లకు దిశానిర్దేశం.
  • పార్టీ సభ్యత్వంలో కొత్తగా జీవితకాల (లైఫ్‌ టైమ్) మెంబర్‌షిప్‌ను చేర్చాలని నిర్ణయం.
  • దీనికోసం ప్రత్యేకంగా రూ.5 వేలు రుసుమును వసూలు చేయాలని నిర్ణయం.
  • తెలంగాణలో టీడీపీ బలోపేతానికి పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేయాలని నేతలకు సూచన.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =