గ్రేటర్ ఎన్నికలకు రేపటి నుంచే మంత్రి కేటిఆర్‌ ప్రచారం ప్రారంభం

Campaigning For GHMC Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Campaigning, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, KTR GHMC Elections Campaign, Mango News, Minister KTR GHMC Elections Campaign, Minister KTR will Start GHMC Elections Campaign, Telangana Bhavan, TRS Working President

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి ప్రచార కార్యక్రమాన్నిపెద్దఎత్తున చేపట్టనుంది. మొత్తం 150 డివిజన్లలో టిఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలవగా, ప్రణాళికబద్దంగా ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్‌ రేపటి నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, మూసాపేట్‌ చిత్తారమ్మ తల్లి చౌరస్తా, ఐడీపీఎల్‌ చౌరస్తా, సాగర్‌ హోటల్‌ జంక్షన్ లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభకు టిఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఈ బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here