జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలనకు ఐదుగురు ఐపీఎస్‌ అధికారులు నియామకం

Hyderabad CP Anjani Kumar ,5 IPS Officers As GHMC Election Observers,GHMC Election Observers,Hyderabad CP, Anjani Kumar, GHMC Elections, GHMC Elections 2020, , GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, GHMC Nominations, Greater Hyderabad Municipal Corporation, Mango News,

హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్‌ అధికారులుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బాధ్యతలు అప్పగించారు. నగరంలో జోన్ల వారీగా వీరిని నియమించారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన, స్ట్రాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత, తనిఖీలు సహా పలు అంశాలను వీరు పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఇప్పటికే నగరంలో తనిఖీల సందర్భంగా రూ.62.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలనకు ఐదుగురు ఐపీఎస్‌ అధికారులు:

  1. అదనపు డీజీపీ షికా గోయల్‌ – ఈస్ట్ జోన్‌
  2. ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌ కుమార్‌ – వెస్ట్‌ జోన్‌
  3. శాంతిభద్రతల అడిషన్‌ సీపీ డీఎస్‌ చౌహాన్‌ – సౌత్‌ జోన్‌
  4. స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి – సెంట్రల్‌ జోన్
  5. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మొహంతి – నార్త్‌ జోన్‌

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here