సోసైటీల్లో సభ్యత్వం మత్స్యకారుల హక్కు, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తాం: మంత్రి తలసాని

Minister Talasani Srinivas held Video Conference with All District Fisheries Department Officials, Talasani Srinivas held Video Conference with All District Fisheries Department Officials, District Fisheries Department Officials, Minister Talasani Srinivas, Talasani Srinivas, Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav Minister for Animal Husbandary, Talasani Srinivas Yadav Minister for Fisheries and Cinematography of Telangana, Telangana Minister, Telangana Minister Talasani Srinivas Yadav, Fisheries Department Officials, Video Conference with All District Fisheries Department Officials, Video Conference, Talasani Srinivas held Video Conference with Fisheries Department, Fisheries Department, Fisheries Department Latest News, Fisheries Department Latest Updates, Mango News, Mango News Telugu,

సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ కు సంబంధించిన పోస్టర్ ను మంత్రి తలసాని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో నూతన నీటి వనరుల విస్తీర్ణం భారీగా పెరగడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద కూడా భారీగా పెరిగిందని వివరించారు. సంపదను సృష్టించాలి, దానిని పేదలకు పంచాలనే ఆలోచనల మేరకు రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపదను ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి మత్స్యకారుడికి అందిస్తామని చెప్పారు.

అందులో భాగంగానే నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు, నూతన సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 4,753 సొసైటీలు ఉన్నాయని, అందులో 3,47,901 మంది సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఇంకా 1185 సంఘాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మే 15వ తేదీ లోగా 100 శాతం సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తమకు సభ్యత్వం రాలేదని అర్హులైన ఏ ఒక్క మత్స్యకారుడు అనేందుకు అవకాశం ఇవ్వవద్దని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండి మత్స్యకార కులాలకు చెందిన వారిని అర్హులుగా గుర్తించాలని సూచించారు. అదేవిధంగా GO 98లో పేర్కొన్న 30 మత్స్యకార కులాలకు చెందిన వారు అర్హులు అవుతారని (సంబంధిత తహసిల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ ను పరిగణలోకి తీసుకోవాలని) చెప్పారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారు అర్హులు అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సభ్యత్వం పొందేందుకు అనర్హులు అవుతారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో మత్స్యకార సంఘాల ఏర్పాటుకు స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులు అని, మత్స్యకార వృత్తిపై నైపుణ్యం లేని వారికి అవసరమైన శిక్షణ ఇప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పిటీసీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారిని భాగస్వాములను చేయాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు సరైన నిధులు కేటాయింపు జరగలేదని, కనీస ఆదరణ కూడా కరువైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. మత్స్య శాఖ అధికారుల కృషి తోనే ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుండి పలు అవార్డ్ లు లభించాయని, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

రాష్ట్రంలో మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని, మత్స్యరంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో విదేశీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని, ఇది తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని అన్నారు. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఫిష్ ఇన్ అనే సంస్థ వెయ్యి కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు సంసిద్దత ను వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, జాయింట్ డైరెక్టర్ లు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − two =