గాంధీ ఆసుపత్రిలో 2 టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించిన మంత్రి తలసాని

Minister Talasani Srinivas Inaugurates 2 Tiffa Scanning Machines at Gandhi Hospital,Minister Thalasani inaugurated 2 Tifa scanning Machines,Tifa scanning Machines at Gandhi Hospital,Tiffa Scanning Machines,Mango News,Mango News Telugu,Telangana Minister Talasani Srinivas Yadav,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

ప్రభుత్వ వైద్య సేవలలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం గాంధీ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన 2 టిఫా స్కానింగ్ మిషన్ లను మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిఫా స్కానింగ్ తో గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ స్కానింగ్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ లో 3 నుండి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తారని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో 56 టిఫా స్కానర్ లను కొనుగోలు చేసి ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్పిటల్స్ లలో ప్రారంభించినట్లు వివరించారు. ఈ స్కానర్ తో గర్బిణీ కి పరీక్ష నిర్వహించడం వలన గర్భంలోని శిశువు అవయవాల ఎదుగుదలలో లోపాలు ఉంటే ముందే తెసుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకు రావడమే కాకుండా హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనేవారని, ప్రభుత్వం అనేక రకాల వైద్య సేవలు, అధునాతన వైద్య పరికరాలను తీసుకురావడంతో నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన గాంధీ హాస్పిటల్ లో కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అనేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ లో క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించుకోవడం జరిగిందని, దీనితో గుండె సంబంధిత ఇబ్బందులను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇదే కాకుండా సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కా న్ వంటివి కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని వివరించారు. అన్ని రకాల వైద్య సేవలకు, చికిత్సలకు నిలయంగా గాంధీ హాస్పిటల్ ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావు బాద్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ లో అనేక నూతన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో సాధించిన ప్రగతి దేశంలోని ఏ రాష్ట్రంలో జరగలేదని అన్నారు. వైద్యం కోసం అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి పరీక్షల కోసమే వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో అనేక రకాల అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ వైద్య పరీక్షలు, మందులు, చికిత్సలు ఉచితంగానే అందించబడుతున్నాయని చెప్పారు. కేవలం వైద్య సేవలు మాత్రమే కాకుండా రోగుల వెంట వచ్చే సహాయకుల విషయంలో కూడా ప్రభుత్వం తగు ఆలోచనలు చేస్తుందని చెప్పారు. హాస్పిటల్ కు వచ్చినప్పుడు భోజనం కోసం రోగుల సహాయకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ ఆవరణ లోనే అతి తక్కువ ధరకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, కార్పొరేటర్ హేమలత, ఆర్ఎంఓ విజయకృష్ణ, శాంతి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =