పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది: మంత్రి తలసాని

Minister Talasani Srinivas Initiates Construction Work of Multi-purpose Community Hall Basti Dawakhana in Khairatabad,Telangana government, development and welfare of poor people, Minister Talasani srinivas yadav,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Multi-purpose Community Hall,Basti Dawakhana,Khairatabad

పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే మల్టీ పర్ఫస్ కమ్యూనిటీ హాల్, బస్తీ దవాఖానా భవనం నిర్మాణ పనులను మంత్రి తలసాని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీరామ్ నగర్ లోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతనంగా నిర్మించే భవనంలో ఫంక్షన్ హాల్, బస్తీ దవాఖాన మాత్రమే కాకుండా, అంగన్ వాడీ కేంద్రం కూడా ఉండేలా చూడాలని, ప్లే గ్రౌండ్ ను కూడా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. గడిచిన 40, 50 సంవత్సరాల నుండి కాలనీ ప్రజలు తమ అవసరాల కోసం అభివృద్ధి పనులు చేపట్టాలని కోరితే ఎవరూ పట్టించుకోలేదన్నారు. స్థానిక కార్పొరేటర్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ల కృషితో అభివృద్ధి పనులు మంజూరైనాయని అన్నారు.

పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు. నిరుపేదలు అధికంగా నివసించే బస్తీలలో అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పెండ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు జరుపుకోవడం పేదలకు పెను ఆర్థికభారం అవుతుందని, అందుకోసమే ప్రభుత్వం మల్టీ పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ ను నిర్మించి అతి తక్కువ అద్దెకు అందిస్తున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బీఎస్ మక్తా, దీనదయాల్ నగర్, గౌరీ శంకర్ నగర్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ తదితర ప్రాంతాల్లో మల్టీ పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ మంజూరైనాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ముఖ్యం కాదని, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ రజనీకాంత్ రెడ్డి, ఈఈ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here