కమ్యూనిస్టు పార్టీలపై జనాల్లో నమ్మకం పోయిందా?

Have people lost faith in communist parties,Have people lost faith,lost faith in communist parties,Faith in communist,Mango News,Mango News Telugu,comunist parties, cpi, cpm, telangana politics, Telangana assembly elections,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana assembly elections Latest News,Telangana assembly elections Latest Updates,CPM Latest News
comunist parties, cpi, cpm, telangana politics, telangana assembly elections

కమ్యూనిస్టు పార్టీలంటే ఒక నమ్మకం.. ఎర్రన్నలు అంటే ఒక ధైర్యం.. ఒక అండ. ఒకప్పుడు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఎర్రజెండాలు ఎగిరేవి. అన్యాయం జరిగిన ప్రతిచోట వారి గొంతు వినిపించేది. న్యాయం చేసేందుకు ఎర్రన్నలు ఉన్నారన్న నమ్మకం ప్రజల్లో ఉండేది. న్యాయం జరిగే వరకు వారు పోరాటం చేసే వారు. ఎంతటి వాడినైనా వదిలిపెట్టే వారు కాదు. ప్రజాసమస్యలపై పోరాటాలు, ఉద్యమాలే ధ్యేయంగా వారు పనిచేసేవారు. అటు రాజకీయ పార్టీలకు కూడా కమ్యూనిస్టు పార్టీలంటే ఒకరకమైన భయం ఉండేది. అందుకే ఏం చేయాలన్నా వెనుకా ముందు ఆలోచించి చేసేవారు.

అయితే రోజురోజుకు కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీలపై నమ్మకం పోతోంది. ఒకప్పుడు ప్రజా సమస్యలపై మాత్రమే పోరాటం చేసే కమ్యూనిస్టులు.. ఇప్పుడు ప్రజలనే పట్టించుకోవడం మానేశారు. ఉద్యమాలు, పోరాటాలను పక్కన పెట్టేశారు. ప్రజాసమస్యలపై వారికి పట్టింపే లేకుండా పోయింది. అసలు వారు వారి లక్ష్యాన్ని పక్కన పెట్టేసి.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని వాడుకొని వ్యక్తిగత ప్రయోజనాలను పొందుతున్నారు.

ఒకప్పుడు ఏ పార్టీలపైన అయితే పోరాటాలు చేశారో.. ఇప్పుడు ఆ పార్టీలతోనే కమ్యూనిస్టులు చేతులు కలుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌తో చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు మంతనాలు జరిపారు. ఇలా తమ ధ్యేయాన్ని మర్చిపోయి.. పోరాటాలు పక్కన పెట్టి.. స్వప్రయోజనాల కోసం పని చేస్తుండడంతో.. జనాల్లో కమ్యూనిస్టు పార్టీలపై నమ్మకం తగ్గిపోతోంది. ఆయా పార్టీలను జనాలు నమ్మడం మానేశారు. అటు ప్రధాన పార్టీలకు కూడా కమ్యూనిస్టు పార్టీలంటే చులకనైపోయాయి. ఈ పరిణామాల మధ్య కమ్యూనిస్టు పార్టీలు చాలా నష్టపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే.. ముందు ముందు మరింత నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 4 =