కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి తలసాని

Minister Talasani Srinivas Says Developing Govt Schools in the State on par with Corporate Schools,Minister Talasani Srinivas,Developing Govt Schools,State on par,TS Govt Schools,TS Corporate Schools,Mango News,Mango News Telugu,Minister Talasani Srinivas Yadav,Talasani Srinivas Yadav,Talasani Srinivas,Talasani Srinivas On Govt Schools,Govt Schools In TS,Telangana Govt Schools,Telangana Govt,Telangana Govt Latest News And Updates

కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అమీర్ పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్ధులకు అగర్ వాల్ సమాజ్ ఆధ్వర్యంలో షూస్ మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్ధులకు విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మన బస్తీ-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం 7200 కోట్ల రూపాయలను కేటాయించారని పేర్కొన్నారు. మొదటి విడతలో 33 శాతం పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు.

అందులో భాగంగా అమీర్ పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 90 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. వీటితో పాఠశాల భవనం మరమ్మతులు, పెయింటింగ్, టాయిలెట్స్ నిర్మాణం, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించడం, ఫర్నిచర్ ను కొనుగోలు చేయడం వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఇవే కాకుండా విద్యార్ధులకు అవసరమైన క్రీడా సామాగ్రి, సాంస్కృతిక ప్రదర్శనలకు కావలసిన పరికరాలు, దుస్తులు వంటివి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలలో ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని 15 రోజులలో అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని మంత్రి ఆదేశించారు. తాను దత్తత తీసుకుంటున్న పాఠశాలను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి, విద్యార్ధులు తమ విద్యను ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగించే విధంగా చేయూతను అందిస్తున్న అగర్ వాల్ సమాజ్ నిర్వహకులను మంత్రి ఈ సందర్బంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవం కలిగిన టీచర్స్ ఉన్నారని, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను అందిస్తున్నదని మంత్రి తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా కనకదుర్గమ్మ దేవాలయంలో అగర్ వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యూరిపైడ్ వాటర్ కూలర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here