‘భారత్‌ జోడో యాత్ర’లో పాల్గొన్న మహాత్మా గాంధీ మునిమనువడు తుషార్‌ గాంధీ, వీర్ సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలకు మద్దతు

Mahatma Gandhi's Great-Grandson Tushar Gandhi Joins Bharat Jodo Yatra Supports Rahul Comments on Veer Savarkar,Supporting Rahul's Comments, Mahatma Gandhi's Great-Grandson ,Tushar Gandhi, Veer Savarkar, Participated In Bharat Jodo Yatra,Mango News,Mango News Telugu,Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Latest News And Updates, Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Meeting in Necklace Road, Rajiv Gandhi, Sonia Gandhi, Telangana Bharat Jodo Yatra

శుక్రవారం మహారాష్ట్రలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర పోరాటంలో కలిసి పనిచేసిన మహాత్మా గాంధీ మరియు జవహర్ లాల్ నెహ్రూ వారసులు కలుసుకున్నారు. నెహ్రూ మునిమనవడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’లో మహాత్మా గాంధీ మునిమనువడు, ప్రముఖ రచయిత తుషార్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిరువురూ కొద్ది దూరం కలిసి నడిచారు. యాత్ర ఉదయం 6 గంటలకు అకోలా జిల్లాలోని బాలాపూర్ నుండి ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత షెగావ్ చేరుకున్న సమయంలో తుషార్ గాంధీ చేరారు. ఇక దీనిపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఒక సందేశం పోస్ట్ చేసింది. నాడు సంక్షోభంలో ఉన్న దేశాన్ని రక్షించడానికి గాంధీ-నెహ్రూ కలిసి వచ్చారు, నేడు వారి వారసులు దానిని కొనసాగిస్తున్నారు’ అని పేర్కొంటూ వారిరువురూ కలిసి నడుస్తున్న ఫోటోను షేర్ చేసింది.

ఈ క్రమంలో మహాత్మాగాంధీ మనువడు తుషార్‌ గాంధీ, వీర్ సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించారు. బ్రిటిషర్స్‌తో వీర్‌ సావర్కర్‌ దోస్తీ నిజమేనని, జైలు నుంచి బయటకు రావడం కోసం బ్రిటిషర్స్‌ను క్షమాపణ కోరాడని తెలిపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత వారికి సహకరించాడని, దీనికి సంబంధించి చరిత్రలో కావాల్సినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా తుషార్‌ పేర్కొన్నారు. తాను బ్రిటిష్ వారి నుంచి పెన్షన్ తీసుకున్నానని, వారికి విధేయుడిగా ఉన్నానని వీడీ సావర్కర్ తెలిపారని చెప్పారు. ఇక రాహుల్ చేస్తున్న ఈ భారత్ జోడో యాత్ర ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న మంచి ప్రయత్నమని, విప్లవాలను తీసుకొచ్చిన మన సంప్రదాయాలకు అనుగుణంగానే యాత్ర జరుగుతోందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దేశ సామాజిక వ్యవస్థ ప్రమాదంలో పడిందని, ప్రజలు చీలిపోతున్న తరుణంలో ఈ యాత్ర ప్రజలను ఏకం చేస్తుందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ ప్రజలందరినీ సంఘటితం చేసే ప్రయత్నమే ఇదని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fifteen =