ప్రభుత్వ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

Telangana CS Somesh Kumar held Review with Collectors to Speed up Ongoing Govt Programs, CS Somesh Kumar held Review with Collectors to Speed up Ongoing Govt Programs, Somesh Kumar held Review with Collectors to Speed up Ongoing Govt Programs, CS Somesh Kumar held Review Meet with Collectors to Speed up Ongoing Govt Programs, Telangana CS Somesh Kumar held Review with Collectors, CS Somesh Kumar held Review Meet with Collectors, Review Meet with Collectors, Collectors, Govt Programs, Telangana Govt Programs, Telangana Chief Secretary, Telangana Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, CS Somesh Kumar, Telangana Govt Programs News, Telangana Govt Programs Latest News, Telangana Govt Programs Latest Updates, CM KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు (యూఎల్బీ)లతో బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి.ఓ.నెం.58, 59 దరఖాస్తుల ప్రాసెసింగ్, అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల గ్రౌండింగ్, తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణముల నిర్మాణం, బహుళస్థాయి అవెన్యూ ప్లాంటేషన్లు మరియు బ్లాక్ ప్లాంటేషన్లు, వరి సేకరణ, దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్‌పై సీఎస్ సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటివల కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ యన్.సత్యనారాయణ, అటవీ శాఖ పిసిసిఎఫ్ డోబ్రియల్, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =