17 స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్

Congrersss Focus On Parliament Elections, Focus On Parliament Elections, Parliament Elections Congrersss, Congrersss Parliament Elections, Parliament Elections Congrersss Focus, Telangana Congress, Parliament Elections, CM Revanth Reddy, Rahul Gandhi, Parliament Elections Updates, Latest Parliament Elections News, Telangana News, Latest Assembly News, TS Politcal News, Mango News, Mango News Telugu
Telangana Congress, Parliament elections, CM Revanth reddy, Rahul gandhi

తెలంగాణలో మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు కూడా రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదని అంతా భావించారు. బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీనేనని అంతా అనుకున్నారు.  కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా.. పరిస్థితుల్ని అనుకూలంగా మల్చుకొని తెలంగానలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పదేళ్ల తర్వాత తెలంగాణ గడ్డపై హస్తం పార్టీ జెండా రెపరెపలాడుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన హస్తం పార్టీ.. ఇప్పుడు త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. అటు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణను సీరియస్‌గా తీసుకుంది. 17కు 17 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. అందుకే అన్ని పార్టీల కంటే ముందే కదనరంగంలోకి దూకేసి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈక్రమంలో పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇంఛార్జ్‌లను నియమించింది. మొత్తం 17 స్థానాలకు పార్టీలోని కీలక నేతల్ని ఇంఛార్జ్‌లుగా నియమించింది.

10 పార్లమెంట్ స్థానాలకు ఒక్కో ఇంఛార్జ్ నియమించగా.. మిగిలిన ఆరు స్థానాల్లో రెండేసి నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పిన ఇంఛార్జ్‌లను హైకమాండ్ నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహబూబ్‌నగర్, చేవెళ్లి స్థానాల బాధ్యతలు అప్పగించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల బాధ్యలు అప్పగించింది. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలను కేటాయించింది.

ఇకపోతే వరంగల్ ఇంఛార్జ్‌గా మంత్రి కొండా సురేఖ.. ఆదిలాబాద్ ఇంఛార్జ్‌గా మంత్రి సీతక్క.. మొదక్ ఇంఛార్జ్‌గా దామోదర రాజనర్సింహ.. పెద్దపల్లి ఇంఛార్జ్‌గా దుద్దిళ్ల శ్రీధర్ బాబును.. కరీంనగర్ ఇంఛార్జ్‌గా పొన్నం ప్రభాకర్‌ను అధిష్టానం నియమించింది. అలాగే జహీరాబాద్ ఇంఛార్జ్‌గా పి సుదర్శన్ రెడ్డి.. నిజామాబాద్ ఇంఛార్జ్‌గా జివన్‌రెడ్డి..నాగర్ కర్నూల్ ఇంఛార్జ్‌గా జూపల్లి కృష్ణారావు.. మల్కాజ్‌గిరి ఇంఛార్జ్‌గా తుమ్మల నాగేశ్వరరావు.. భువనగిరి ఇంఛార్జ్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నల్గొండ ఇంఛార్జ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు పార్టీ హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. ముందుగానే ఇంఛార్జ్‌లను నియమించడం ద్వారా ఆ స్థానాలపై పట్టు సాధించవచ్చని హైకమాండ్ భావిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =