రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా? – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Responds over Assault of BJP National Secretary Satya Kumar Car,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Responds over Assault of BJP,Assault of BJP National Secretary Satya Kumar Car,BJP National Secretary Satya Kumar,Mango News,Mango News Telugu,BJP National Secretary Satya Kumar Latest News,BJP National Secretary Satya Kumar Latest Updates,Janasena Chief Pawan Kalyan Live News,BJP Satya Kumar Car News Today,Stones pelted on BJP National Secretary,BJP natl secy Satya Kumar's car attacked,Tension at Amaravati,YCP Supporters Attack BJP,BJP condemns attack on Satya Kumar,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందనే వాస్తవం ఈ దాడితో మరోమారు తేటతెల్లమయిందని, ఈ దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని అన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని రాష్ట్ర పాలకులు సందేశం ఇస్తున్నారా? అని పవన్ ప్రశ్నించారు. ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానం అయితే మేము కచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తామని అన్నారు. ‘ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారు’ అని వైసీపీ ఎంపీ ప్రకటించారు అంటూ సత్య కుమార్ చెప్పిన మాటలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలన్నారు.

“రాజధాని ప్రాంతంలో వైసీపీ శ్రేణులు చేసిన ఈ దాడి ఘటనను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ముఖ్యమంత్రినీ, ఆయన పార్టీనీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరస్కరించారు. క్షోభపడుతున్న రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను, సంఘాలను వైసీపీ ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు వర్గ శత్రువులుగా చూస్తున్నారు. రాష్ట్ర పాలకులు సామాన్య ప్రజలపైనా, ప్రశ్నించిన వారిపైనా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నదీ, ప్రతిపక్ష నాయకులను వేధిస్తూ, వారిపై దాడులకు పాల్పడుతున్నదీ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి జనసేన పార్టీ తీసుకువెళ్తుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =