రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో.. లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

Amid Row Over Rahul Gandhi Disqualification Lakshadweep MP Mohammed Faizal's Lok Sabha Membership Restored,Amid Row Over Rahul Gandhi Disqualification,Lakshadweep MP Mohammed Faizal,Lok Sabha Membership Restored,Mohammed Faizal,Mango News,Mango News Telugu,Amid Rahul Gandhi Disqualification Row,Lok Sabha restores NCP MP Mohammad Faizal,Lakshadweep NCP leader Mohammed Faizal,Lakshadweep MP on delay in restoring,Lok Sabha Secretariat Revokes,Amid Rahul Row,Lok Sabha Membership Latest News,MP Mohammed Faizal Latest Updates,Rahul Gandhi Disqualification News

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. లోక్‌సభ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో లక్షదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం ఈరోజు పునరుద్ధరించబడింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌పై ప్రస్తుతం అమలులో ఉన్న అనర్హత వేటును లోక్‌సభ రద్దు చేసింది. ఈ మేరకు ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. కాగా ఓ హత్యాయత్నం కేసులో ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది జనవరి 11న కవరట్టి సెషన్స్‌ కోర్టు ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో జనవరి 13న లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం ఆయన తన జైలు శిక్షను సవాల్‌ చేస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన కోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించింది. అయితే ఈ వ్యవహారంలో కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించకముందే లోక్‌సభ ఆయనపై అనర్హత ఎత్తివేయడం గమనార్హం.

కాగా రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత ఆయనపై అనర్హత లోక్‌సభ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ చర్య దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్ త్వరలో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్షద్వీప్‌ ఎంపీపై అనర్హత ఎత్తివేత నిర్ణయం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. మరోవైపు సూరత్‌లోని కోర్టు తనను దోషిగా నిర్ధారించడాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు లేదా రేపు సెషన్స్ కోర్టులో దాఖలు కావచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే రాహుల్‌ గాంధీ అనర్హత వేటుతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్‌లో ఉప ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తే న్యాయపోరాటానికి సిద్ధమని కాంగ్రెస్ చెబుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − seven =