ఈ-పంచాయతీ నిర్వహణలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్, మరో అవార్డు కైవసం

ePanchayat, Maintenance of e-Panchayat, Mango News, Mango News Telugu, National Award For Telangana, National Award For Telangana in Maintenance of e-Panchayat, Number One in the Country in Maintenance of e-Panchayat, Panchayat Raj, telangana, Telangana Bags one more National Award, Telangana News, Telangana Number One in the Country in Maintenance of e-Panchayat, Telangana Panchayat Raj Act, Telangana wins national award for best e-Panchayat

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరో అవార్డును గెలుచుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ-పంచాయతీ పురస్కారాలను అందజేస్తుంది. 2019-20కి ఈ-పంచాయతీ అవార్డు తెలంగాణకు దక్కింది. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహరా ఈ అవార్డును తెలంగాణకు ప్రకటించారు. దేశంలోని గ్రామ పంచాయతీలను ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న గ్రామాలను మూడు విభాలుగా విభజించింది. పంచాయతీ ఎంటర్ ప్రైజ్, సూట్ అప్లికేషన్స్ అండ్ స్టేట్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ లలో 3 విభాగాలుగా విభజించింది. అందులో 2వ విభాగంలో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మూడో స్థానం రాజస్థాన్ కు వచ్చింది.

ఈ అవార్డు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డులు రావడానికి కారణమైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శి సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్ కృషి, దార్శనికత వల్లే ఇదంతా సాధ్యపడింది:

ఇంత మంచి శాఖను తనకు అప్పగించడం, అనేక అవార్డులు రావడం తన అదృష్టంగా మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. అంతేగాక తెలంగాణ ఏర్పడ్డాక, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్నారని అన్నారు. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర స్థానిక సంస్థలకు 12 అవార్డులు వచ్చాయని, అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇప్పుడు అలాంటి గంగదేవి పల్లెలు తెలంగాణ రాష్ట్రమంతా ఏర్పడుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వాటికి నిదర్శనమే ఈ అవార్డులని మంత్రి తెలిపారు. కాగా ఈ అవార్డులు రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, తన పేషి, ఇతర రాష్ట్ర స్థాయి నుండి పారిశుధ్య కార్మికుల వరకు ప్రతి ఒక్కరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =