కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచండి: సీఎస్

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, COVID-19 Situation, CS Somesh Kumar held a High Level Review Meeting, CS Somesh Kumar held a High Level Review Meeting on Covid-19 Situation, CS Somesh Kumar Review Meeting, CS Somesh Kumar Review Meeting Over Covid-19 Situation, Mango News, Somesh Kumar, telangana, Telangana Coronavirus, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Review Meeting

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్ధితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

అన్ని జిల్లాలో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని చెప్పారు. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు పాటించేలా నిబంధనల అమలుకు కృషిచేయాలని, ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని అన్నారు. అలాగే కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఆక్సీజన్ ను సక్రమంగా వినియోగించి, వృధాను అరికట్టేలా చైతన్యపరచాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, వైద్య, ఆరోగ్య శాఖ అడ్వైజర్ టి.గంగాధర్, టీఎస్ హెఛ్ఎంఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =