తమిళనాడు: అన్నాడీఎంకే నుంచి మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం బహిష్కరణ.. పళనిస్వామికే పార్టీ పగ్గాలు

Tamil Nadu AIADMK General Council Expels Ex-CM Panneerselvam From The Party, AIADMK General Council Expels Ex-CM Panneerselvam From The Party, EPS Elected As Interim General Secretary Of AIADMK And OPS Expelled From Party, EPS Elected As Interim General Secretary Of AIADMK, OPS Expelled EPS From Party, AIADMK elected Edappadi K Palaniswami its interim general secretary and expelled O Panneerselvam from the primary membership, AIADMK expelled O Panneerselvam from the primary membership, AIADMK elected Edappadi K Palaniswami its interim general secretary, Edappadi K Palaniswami AS AIADMK interim general secretary, AIADMK interim general secretary, All India Anna Dravida Munnetra Kazhagam, Revenue authorities have sealed the AIADMK headquarters, interim general secretary, AIADMK interim general secretary News, AIADMK interim general secretary Latest News, AIADMK interim general secretary Latest Updates, AIADMK interim general secretary Live Updates, Mango News, Mango News Telugu,

తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నుంచిమాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్‌ నేత ఓ పన్నీర్‌ సెల్వంను బహిష్కరించింది. దశాబ్దాల పాటు పార్టీని, రాష్ట్రాన్ని పాలించిన ‘అమ్మ’ జయలలిత మరణానంతరం పార్టీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య సీఎంగా పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామి క్రమంగా పార్టీలో కూడా ప్రాధాన్యం పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి ముగింపు పలుకుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పన్నీర్ సెల్వంను బహిష్కరించింది.

చెన్నైలోని రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐదేళ్ల విరామం తర్వాత ఎగ్జిక్యూటివ్ జనరల్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్నాడీఎంకే కార్యవర్గం మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే పన్నీర్‌ సెల్వం ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడంతో పాటు సహ కోశాధికారి పదవి నుంచి తొలగించింది. అంతే కాకుండా ఆయన మద్దతుదారులను కూడా పార్టీ నుంచి బహిష్కరించింది. మరో నాలుగు నెలల్లో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానించింది. అప్పటివరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నికకు ఆమోదం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =