జనవాణి అర్జీల పరిష్కారం దిశగా అడుగులు, కార్యచరణను సమీక్షించిన నాదెండ్ల మనోహర్

Jana Vaani-JanaSena Bharosa Nadendla Manohar Reviews People Applications and Solutions Process, Nadendla Manohar Reviews People Applications and Solutions Process, Nadendla Manohar Reviews Solutions Process, Nadendla Manohar Reviews People Applications, Jana Vaani-JanaSena Bharosa, Jana Sena Party political affairs committee chairman Nadendla Manohar, Janasena Party PAC Chairman Nadendla Manohar, PAC Chairman Nadendla Manohar, Janasena Party PAC Chairman, Nadendla Manohar, Jana Sena Party political affairs committee chairman, political affairs committee chairman, Janasena Party, Jana Vaani-JanaSena Bharosa News, Jana Vaani-JanaSena Bharosa Latest News, Jana Vaani-JanaSena Bharosa Latest Updates, Jana Vaani-JanaSena Bharosa Live Updates, Mango News, Mango News Telugu,

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు ఆదివారాల్లో విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో “జనవాణి-జనసేన భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించి, సమస్యలతో సతమతం అవుతున్న బాధిత పక్షాల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన భరోసా కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గత రెండు విడతల్లో స్వీకరించిన అర్జీల పరిశీలన చేసి, వాటిపై లేఖలు రాసే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారాలు సంబంధిత కార్యాచరణపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ సమీక్షించారు.

విశ్రాంత ఐఏఎస్ అధికారి, పార్టీ నాయకుడు డి.వరప్రసాద్ నేతృత్వంలో వచ్చిన అర్జీలను శాఖల వారీగా విభజించి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు అర్జీదారుల సమస్యలను తెలియజేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందం పని చేస్తుందని చెప్పారు ప్రతి అర్జీని ఎప్పటికప్పుడు అనుశీలన చేసి, సమస్యను పరిష్కారం దిశగా తీసుకువెళ్లేందుకు ఈ బృందం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే పార్టీ అధినేత పవన కళ్యాణ్ ప్రతి సమస్యను సమీక్షించి, స్వయంగా సంబంధిత శాఖలకు లేఖలు రాస్తారని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =