తెలంగాణ బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలు

Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2019, Telangana Assembly Budget Session 2019-20, Telangana Breaking News, Telangana Budget 2019-20 Live Updates, Telangana budget session, Telangana Budget Session 2019, Telangana Budget Session 2019-20, Telangana Budget Session 2019-20 Live Updates, Telangana Legislative Assembly Budget, Telangana Legislative Assembly Budget session, Telangana Legislative Assembly Budget Session 2019, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో రూ.1.82 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టగా సెప్టెంబర్ తో దాని కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తెరాస ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్థికమాంద్యం దృష్ట్యా వాస్తవిక దృక్పధంతో తయారుచేసినట్లు తెలుస్తుంది.

తెలంగాణ బడ్జెట్ 2019-20 ముఖ్యంశాలు:

 • 2014 జూన్ లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించింది
 • స్వల్ప కాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు
 • కొత్త కొత్త పధకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది
 • 2013-14 లో జీఎస్డీపీ విలువ రూ. 4,51,581 కోట్లు.
 • ఐదు సంవత్సరాలలో తెలంగాణ ఆదాయం రెట్టింపయింది
 • మొత్తం తెలంగాణ బడ్జెట్ రూ.1,46,492.3 కోట్లు
 • రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు
 • మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు
 • 6.3 శాతం అదనపు వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం
 • రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081. 08 కోట్లు
 • బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044 కోట్లు
 • రైతుబంధు పధకానికి రూ.12 వేల కోట్లు
 • రైతుల ఉచిత విద్యుత్ కు ఇప్పటివరకు రూ. 20,950 కోట్లు ఖర్చు
 • పంట రుణాల మాఫీకి రూ. 6 వేల కోట్లు
 • ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు కేటాయింపు
 • అభివృద్ధి సంక్షేమం కొరకు ఐదేళ్లల్లో రూ. 5,37,373 కోట్లు
 • గ్రామ పంచాయితీలకు రూ. 2,714 కోట్లు
 • ఆరోగ్యశ్రీకి సంవత్సరానికి రూ.1,336 కోట్లు
 • పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు
 • రైతు బీమా ప్రీమియం చెల్లింపుకు రూ. 1137 కోట్లు
 • ఉదయ్ పధకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది
 • ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పధకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులు రూ. 31, 802 కోట్లు
 • పన్నుల రూపంలో ఐదేళ్లలో రాష్ట్రము నుంచి కేంద్రానికి వెళ్లిన నిధులు రూ. 2,72,926 కోట్లు
 • ఐటీ రంగంలో 2018-19 నాటికీ 11.05 శాతం వృద్ధి రేటు
 • 2018-19 నాటికీ రూ. లక్షా పదివేల కోట్ల ఐటీ ఎగుమతులు
 • మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల పునరుద్ధరణ
 • గురుకులాల్లో లక్షలాది విద్యార్థులకు కార్పొరేట్ విద్య
 • ఆర్థిక మాంద్యం వలన ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది
 • అన్ని శాఖల్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లింపు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు
 • బకాయిలు పూర్తి చేశాకే కొత్త పనులకు శ్రీకారం
 • గ్రామ పంచాయితీలను 12,751 కు పెంచాం
 • జిల్లా పరిషత్ లను 32 కు పెంచాం
 • మండలాలను 459 నుంచి 584 కు పెంపు
 • మున్సిపాలిటీలను 68 నుంచి 142 కు పెంపు
 • మున్సిపల్ కార్పొరేషన్స్ 13 కు పెంచాం
 • పోలీస్ కమిషనరేట్ల సంఖ్య 9కి పెంపు
 • పోలీస్ స్టేషన్ల సంఖ్య 814 కు పెంపు
 • కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో వినూత్న సేవలు
 • గ్రామాల అభివృద్ధికి ఈ నెల 6 నుంచి 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ
 • వాస్తవిక దృక్పధంతో బడ్జెట్ రూపకల్పన
 • నిధుల వినియోగంపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థికశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here