తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు, వ్యాక్సిన్లపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్

Telangana Cabinet Decisions over Corona Control Measures and Lockdown Imposition,Mango News,Mango News Telugu,Telangana Cabinet,Telangana Cabinet Meet,Telangana Cabinet Meeting,Telangana CabinetLive,Telangana Cabinet News,Telangana Cabinet Live Updates,Telangana Cabinet Live News,Corona Control,CM KCR,Telangana CM KCR,Telangana News,CM KCR Live,Telangana State,CM KCR,Telangana Cabinet Decisions,Telangana Cabinet meeting over Corona Control Measures,CM KCR On Lockdown,Lockdown,Lockdown In Telangana State,Telangana Lockdown Updates,Telangana Lockdown Live Updates,Telangana Lockdown News,Covid-19 In Telangana,Telangana Lockdown,Lockdown In Telangana

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ విధింపు తదితర అంశాలకు సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు :

  • మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్‌ కఠినంగా అమల్లో ఉంటుంది.
  • మే 20వ తేదీన కేబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్‌డౌన్‌ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.
  • ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు.
  • యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.
  • ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కేబినెట్ ఆదేశించింది.
  • అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.
  • రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో కేబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + thirteen =