జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

#KCR, Chief Minister of Telangana, CM KCR, Hyderabad Metro Rail, JBS-MGBS Metro, JBS-MGBS Metro Corridor, JBS-MGBS Metro Route, Jubilee Bus Station, K Chandrashekar Rao, Mahatma Gandhi Bus Station, Mango News Telugu, Telangana CM KCR
జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌ ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జేబీఎస్‌ స్టేషన్‌లో పచ్చ జెండాను ఊపి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఎంజీబీఎస్‌ స్టేషన్ వరకు ఆయన ప్రయాణించారు. ఈ మెట్రో మార్గం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1లో చివరిదైన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ ను సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. 11 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌లో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ వంటి 9 స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా అత్యంత ఎత్తులో నిర్మించిన మెట్రో స్టేషన్ గా జేబీఎస్ నిలవనుంది. ఈ స్టేషన్ ను ఐదంతస్తుల ఎత్తులో నిర్మించారు. అలాగే ఈ కారిడార్ ప్రారంభోత్సవంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ మెట్రోరైల్‌ నిలిచింది.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Video thumbnail
Telangana CM KCR Inaugurates JBS - MGBS Metro Corridor In Hyderabad | Telangana News | Mango News
07:37
Video thumbnail
Telangana CM KCR Participates In Sammakka Saralamma Jatara | Telangana Latest News | Mango News
08:26
Video thumbnail
Telangana Governor Tamilisai Soundararajan Participates At Medaram Jathara | Telangana | Mango News
15:47
Video thumbnail
TRS MP Nama Nageswara Rao Praises CM KCR In Parliament Session | Lok Sabha 2020 | Mango News
07:10
Video thumbnail
CM KCR Superb Decision Over MSP For Farmers Crops | Telangana Municipal Election Results 2020
08:55
Video thumbnail
Minister KTR Applauds TRS Party In Press Meet At Telangana Bhavan | Telangana Politics | Mango News
06:42
Video thumbnail
CM KCR About New Urban Development Scheme In Press Meet | Telangana Municipal Election Results 2020
05:51
Video thumbnail
Minister KTR Strong Warning To Party Leaders In Press Meet | Telangana Bhavan | Mango News
09:32
Video thumbnail
Minister KTR Speech About Greatness Of CM KCR In Press Meet | Telangana Political News | Mango News
09:07
Video thumbnail
Minister KTR Funny Comments On Uttam Kumar Reddy In Press Meet | Telangana Politics | Mango News
10:29
Video thumbnail
Governor Tamilisai Soundararajan Pays Homage To Mahatma Gandhi On His Commemoration Day | Mango News
03:10
Video thumbnail
Minister Harish Rao About KCR Letter To Centre Over Kaleshwaram & Mission Bhagiratha |Telangana News
02:52
Video thumbnail
KTR Gives Strong Assurance To Municipalities In Press Meet | Telangana Political News | Mango News
06:28
Video thumbnail
KTR Expresses His Happiness Over TRS Victory In Municipal Elections | Telangana News | Mango News
06:55
Video thumbnail
KTR Special Thanks To MIM Party For Supporting In Nizamabad | Telangana Political News | Mango News
08:12
Video thumbnail
CM KCR Congratulates Party President KTR In Press Meet | Telangana Municipal Election Results 2020
03:57
Video thumbnail
Only Congress Party Gives Strong Competition To TRS Party Says MP Revanth Reddy | Mango News
04:50
Video thumbnail
CM KCR Sensational Statements In Press Meet | Telangana Municipal Election Results 2020 | Mango News
04:02
Video thumbnail
CM KCR Rejects CAA In Telangana State | KCR Press Meet | Telangana Municipal Election Results 2020
11:56

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here